Begin typing your search above and press return to search.
విక్రమ్ ల్యాండర్ పల్టీ రహస్యాన్ని చేధించిన ఇస్రో
By: Tupaki Desk | 17 Nov 2019 9:12 AM GMTచంద్రయాన్ 2లో కీలకమైన దశల్ని విజయవంతంగా దాటేసి.. మరికొద్ది నిమిషాల్లో పూర్తిస్థాయి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నామని కోట్లాది మంది భారతీయులు ఎంత ఉత్కంటతో ఎదురుచూసిన వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకోవటం.. విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు కోల్పోవటం తెలిసిందే.
అత్యంత క్లిష్టమైన.. కష్టమైన.. సున్నితమైన దశను అధిగమించటంలో ఫెయిల్ అయ్యిందన్న మాటను మూటగట్టుకున్నా.. ఎవరూ ఇస్రో సామర్థ్యాన్ని తక్కువ చేయలేదనన విషయాన్ని మర్చిపోకూడదు. తమ ప్రయోగం ఫెయిల్యూర్ మీద అంతర్గత విచారణ జరుపుతున్న ఇస్రో.. తాజాగా కీలక అంశాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో ఫెయిల్ కావటానికి కారణం.. సాఫ్ట్ వేర్ లోపమన్న కీలక విషయాన్ని తాజాగా గుర్తించారు.
దీనికి సంబంధించిన అంతర్గత నివేదికను స్పెస్ కమిషన్ కు అందజేసినట్లు చెబుతున్నారు. చివరి నిమిషంలో చోటు చేసుకున్న ఫెయిల్యూర్ వెనుక సాఫ్ట్ వేర్ లోపం ఉందని గుర్తించినా.. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం తయారు చేసిన సాఫ్ట్ వేర్ ను పరీక్షించినప్పుడు మాత్రం ఎలాంటి సమస్యా తలతెత్తలేదని చెబుతున్నారు.
ఆర్బిటర్ నుంచి విడిపోయి దాదాపు 30 కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణించి.. రఫ్ బ్రేకింగ్ దశ నుంచి ఫైన్ బ్రేకింగ్ దశకు వచ్చినప్పుడు మాత్రమే సమస్య మొదలైనట్లు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్ కు అమర్చిన థ్రస్ట్ లలో ఒక దానిని మండించి సెకనుకు 146 మీటర్లు ప్రయాణించేలా చేసే విషయంలో నియంత్రణ కోల్పోయింది. ఫలితంగా సెకనుకు 750 మీటర్ల వేగంతో చంద్రుడ్ని ఢీకొట్టింది. ఇదే విక్రమ్ ల్యాండర్ పల్టీ కొట్టటానికి కారణమని చెబుతున్నారు. వచ్చే ఏడాది చంద్రయాన్ 3ను ప్రయోగించనున్న వేళ.. ఈ లోపాన్ని అధిగమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.