Begin typing your search above and press return to search.
ఈ సెంటిమెంట్ ను ఎలా మిస్ అయ్యారు కేసీఆర్?
By: Tupaki Desk | 2 May 2021 7:30 AM GMTరాజకీయాలకు సెంటిమెంట్లకు ఉండే అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందునా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న సెంటిమెంట్ల గురించి అందరికి తెలిసిందే. తాను చేపట్టే ముఖ్యమైన పని వేళ..‘‘ఆరు’’ అంకె ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు.. కీలక సెంటిమెంట్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ.. అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉంటారు. అలాంటి కేసీఆర్ తొలిసారి మంత్రి ఈటెల మీద కత్తి నూరే హడావుడిలో టచ్ చేయకూడని సెంటిమెంట్ ను టచ్ చేశారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇంతకీ కేసీఆర్ మిస్ అయిన సెంటిమెంట్ ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా ఎవరు కుర్చీలో కూర్చున్నా.. ఏదో ఒక కారణంతో వారిని తొలగించే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా రాజయ్యకు బాధ్యతలు అప్పజెప్పారు. ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు రావటం.. ఆ వెంటనే ఆయనపై వేటు పడటం.. ఆయన కాస్తా తెర వెనక్కి వెళ్లిపోవటం తెలిసిందే. అప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లోమాంచి ఛరిష్మా ఉన్న నేతగా ఉన్న ఆయన.. ఆ తర్వాత నుంచి ఎవరికి పట్టనివాడయ్యారు.
అనంతరం.. వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా కేసీఆర్ కు అత్యంత విధేయుడైన లక్ష్మారెడ్డికి అప్పజెప్పారు. ఆ పోస్టులోకి వచ్చింది మొదలు ఆయనపై ఆరోపణలు రావటం తెలిసిందే. మొదటి టర్మ్ పూర్తి అయ్యే వరకు అతి కష్టమ్మీదా ఆ పదవిలో సాగినా.. ఆయన్నుసాగనంపక తప్పలేదు. ఆ తర్వాత ఆ శాఖను చేపట్టే బాధ్యత ఈటల రాజేందర్ కు అప్పజెప్పారు.
ఈటల లాంటి నేతపై తాజాగా భూకబ్జా ఆరోపణలు రావటం.. సీఎం కేసీఆర్ సీరియస్ కావటం.. ఆయన్ను ఆ మంత్రిత్వ శాఖనుంచి తప్పించటం తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా.. సెంటిమెంట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండే కేసీఆర్.. తాజాగా వైద్య ఆరోగ్య శాఖను మరో మంత్రికి అప్పజెప్పకుండా తన పరిధిలోనే ఉంచుకోవటం షాకింగ్ గా మారింది. కారణం ఏమైనా కానీ.. వైద్య ఆరోగ్య శాఖను చేపట్టిన ఏ మంత్రికైనా చేదు అనుభవాలే మిగిలే పరిస్థితి. అలాంటిది.. అలాంటి మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి తన దగ్గర ఉంచటం.. తానే చూస్తానని చెప్పటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ మంత్రిత్వశాఖను చేపట్టిన వారెవరైనా సరే.. తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవటం రివాజుగా ఉండేది. అంతేకాదు.. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా బాధ్యతలు చేపట్టేవారెవరు తర్వాత ఎన్నికల్లో ఓడిపోవటం ఒక సెంటిమెంట్ గా ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ను చేపట్టిన వారి పదవి మధ్యలోనే పుటుక్కుమనే పరిస్థితి.మరి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మిస్ అయ్యారా? కాకుంటే.. తన వద్ద ఉంచుకునే వారా ఏంటి?