Begin typing your search above and press return to search.
పవన్ పై ఇంత నెగెటివ్ ప్రచారం ఎలా మొదలైంది?
By: Tupaki Desk | 2 Oct 2021 6:30 AM GMTఇప్పుడు ప్రస్తావించే విషయాలు ఇప్పటివరకు ఏ మీడియాలో ప్రస్తావించని అంశాలు. రాజకీయ.. సినిమా రంగానికి చెందిన పలువురితో మాట్లాడినప్పుడు.. వారు వ్యక్తిగతంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు. కారణాలు ఏమైనా.. వారు తమ పేర్లను ఎక్కడా ప్రస్తావించకూడదన్న ప్రామిస్ తో షేర్ చేసుకున్నారు. అందుకే.. వారి పేర్లను రివీల్ చేసే అవకాశం లేదు. ఇక.. నేరుగా విషయంలోకి వెళ్లిపోదాం.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడట.. పేరు పవన్ కల్యాణ్.. అంటూ ఒకట్రెండు సినిమాలు తీసినప్పుడు చిరు ప్రస్తావన తర్వాతే పవన్ మాట వినిపించేది. ఆ మాటకు వస్తే కల్యాణ్ బాబు పెద్దగా కంట్లో పడింది లేదు. గోకులం సీతలో కాస్త టచ్ అయిన పవన్.. తొలిప్రేమ.. తమ్ముడు సినిమాలతో ఒక్కసారిగా అతడి ఇమేజ్ మారింది. ఆయనో స్టార్ గా గుర్తింపు పొందారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పుడు.. ఎవరికి లేనంత.. రానంత స్వల్ప వ్యవధిలో పవన్ కు ఎందుకంత ఇమేజ్ వచ్చింది? అన్న ప్రశ్నకు.. పవన్ కల్యాణ్ తీరే అందుకు కారణమన్న సమాధానం వస్తుంది.
అలాంటి పవన్ కల్యాణ్ కు మొదట్నించి చూస్తే.. మీడియా అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదు. దీనికి కారణం ఇంటర్వ్యూలు ఇవ్వటానికి పవన్ పెద్దగా ఆసక్తి చూపించకపోవటం.. తాను ప్రచారానికి ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వకపోవటం. అప్పటికి సినిమా బీట్ రిపోర్టర్లకు ప్యాకేజీల్ని ఇవ్వటం ద్వారా.. హీరోలు.. హీరోయిన్ల పీఆర్వోలు తమ శక్తి కొలది ప్రచారం చేసుకోవటానికి ప్రయత్నించేవారు. కొన్ని ప్రముఖ వారపత్రికల్లో .. సినిమా పత్రికల్లో కవర్ పేజీ ఫోటో రావాలంటే యాజమాన్యాలకు తెలీకుండా.. డబ్బులు ఇవ్వాల్సి ఉండేది. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇలాంటి వాటి విషయంలోకి పవన్ ఎంటర్ అయ్యేవాడు కాదు. తన ఫోటో కవర్ పేజీగా రావాలన్న లోగుట్టు లాబీయింగ్ జరిగేది కాదు. కానీ.. అతగాడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో తప్పనిసరిగా కొన్ని సందర్భాల్లో అతడి ఫోటోలు వేయాల్సి వచ్చేసింది.
మిగిలిన హీరోలకు భిన్నంగా.. నవ్వుతూ మాట్లాడి.. తమకు ఇవ్వాల్సిన కవర్లు ఇవ్వని పవన్ మీద అప్పటి కొందరు ప్రముఖ మూవీ జర్నలిస్టులకు ఒకలాంటి గుర్రు ఉండేది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట్నించి ఉన్న అలవాటు.. నెగిటివ్ రాయకపోవటం.. పాజిటివ్ మాత్రమే రాయటం. తమిళ సినీ జర్నలిస్టులు కవర్లు తీసుకున్నా.. పాజిటివ్ రాస్తూనే.. నెగిటివ్ వార్తలు రాయటానికి ఏ మాత్రం మొహమాట పడేవారు కాదు. కానీ.. తెలుగు సినిమా జర్నలిస్టులకు సంబంధించి.. మొదట్నించి నెగిటివ్ వార్తలు.. పుకార్లను రాయటం లాంటివి లేకుండా.. అందరూ బాగున్నారు.. అంతా బాగుంది.. పరిసరాలు పచ్చగా ఉన్నాయన్నట్లుగా వార్తలు వచ్చేవి.
సినిమా ఎంత అట్టర్ ప్లాప్ అయినా.. దాన్ని పొగుడుతూనే రాసే ధోరణి కనిపించేది. ఎందుకిలా అంటే.. అప్పటి మీడియా యాజమాన్యాలకు సినిమా ఇండస్ట్రీతో ఉన్న కమిట్ మెంట్లే ఇందుకు కారణం. దీంతో వారి అబ్లిగేషన్లతో పాటు.. కవర్ల పుణ్యమా అని.. తెలుగు సినిమా వార్తలకు సంబంధించి నెగిటివ్ అన్నది కనిపించేది కాదు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చాలామందికి ఇబ్బందిగా అనిపించేదేమంటే.. తాము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు కలవటానికి.. మాట్లాడటానికి.. కవర్లు పుచ్చుకోవటానికి ఉన్న అవకాశం పవన్ వద్ద ఉండేది కాదు. అలా అని వదిలేద్దామా? అంటే.. బయట ఆదరణ చాలా ఎక్కువ. అలా అని రాద్దామా అంటే.. మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే పవన్ గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలకు మనసు ఒప్పేది కాదు.
ఇలాంటి వేళలోనే.. పవన్ గురించి మీడియా వర్గాల్లో తరచూ వినిపించే మాట.. ‘కాస్త డిఫరెంట్ అండి’ అని. తర్వాతి కాలంలో అది కాస్త తిక్క ఎక్కువ అండి.. అది కాస్తా పిచ్చి అని.. ఇప్పుడు ఏకంగా సైకో అనే వరకు వెళ్లిపోయారు. కాస్త డిఫరెంట్ అన్న వేళలోనే.. ఇండస్ట్రీలో ఎన్నో సాయాలు చేసినా సైలెంట్ గా ఉండే మీడియాకు చెందిన పలువురు పవన్ ను పరిటాల రవి గుండు కొట్టించాడని.. మెగాస్టార్ చిరు ఎంట్రీ ఇచ్చి ఇష్యూ సెటిల్ చేశారన్న ప్రచారం మాత్రం పేపరకు ఎక్కకుండానే అందరి లోకి ఎక్కించారు.
నిజంగా అప్పట్లో ఏం జరిగిందన్న దానికి.. సినీ వర్గాలకు చెందిన వారు చెప్పే మాటేమంటే.. స్థలం విషయంలో వచ్చిన వివాదం గురించి మాట్లాడటానికి వెళ్లిన పవన్ మీద పరిటాల దౌర్జన్యం చేయబోవటం.. దానికి చిరు వెంటనే సీన్లోకి రావటంతో రాజీ జరిగిందని చెబుతారు. మరికొందరు వివాదం ఉంది కానీ.. పరిటాల వార్నింగ్ ఇచ్చే వరకు విషయం వెళ్లలేదని స్పష్టం చేస్తారు. ఈ రెండు వాదనలకు భిన్నంగా పవన్ కు గుండు కొట్టించారని.. సున్నం బొట్లు పెట్టారంటూ జరిగిన ప్రచారం ఎంతో అందరికి తెలిసిందే. అసలేం జరగకుండా ఇంత దారుణమైన నిందల్ని పవన్ ఎందుకు ఎదుర్కొన్నారంటే.. అందుకు కారణం.. మీడియాకు చెందిన పలువురిని శాటిస్ ఫై చేయకపోవటమే.
ఇంత జరుగుతున్నా.. తన తీరును మార్చుకోలేదు పవన్ కల్యాణ్. ఓవైపు కొందరు పరిటాల ఇష్యూను తెర మీదకు తీసుకొచ్చి ఆయన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే.. అందుకు భిన్నంగా పవన్ ఇమేజ్ అంతకంతకూ పెరిగిపోవటం మింగుడు పడేది కాదు. దీనికి తోడు.. పవన్ సేవా దృక్ఫదం..కష్టంలో ఉన్న వారి పట్ల ఆయన వ్యవహరించే తీరు మౌత్ టాక్ ద్వారా అంతకంతకూ పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వేడుకల్లోనే కాదు.. సెట్లలోనూ సింఫుల్ గా వ్యవహరించే పవన్ కు సంబంధించిన విషయాలు తరచూ బయటకు వచ్చేవి. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగేది.
ఎందుకిలా అంటే.. మిగిలిన వారి సంగతులన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చేవి. పవన్ ప్రస్తావనే ఉండేది కాదు. దీంతో.. మౌత్ పబ్లిసిటీ ద్వారా పవన్ ఇమేజ్ అంతకంతకూ విస్తరించింది. అసలేం చేయకున్నా.. అతగాడి ఇమేజ్ ఎందుకిలా పెరగటం అన్నది అర్థమయ్యేది కాదు. ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా.. అందుకు భిన్నంగా అతడికి హీరోయిజం యాడ్ కావటం.. క్రమంగా అది పవనిజంగా మారడం జరిగింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన అన్న చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే సీరియస్ అయ్యే తత్త్వం పవన్ లో ఉండేది. అందుకు తగ్గట్లే.. ఒకట్రెండు సినిమా ఫంక్షన్లలో పవన్ ఆవేశంగా రియాక్టు కావటం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం చాలామందికి నచ్చేది. దీనికి తోడు.. తానో పెద్ద స్టార్ అన్నట్లు బిల్డప్ లేకపోవటం.. బిడియంగా ఉండటం.. మాట్లాడటానికి సిగ్గు పడటం లాంటివి పవన్ ను మిగిలిన వారికి ప్రత్యేకంగా నిలిపేవి. తమ సినిమా గురించి సూపరు.. డూపరు.. అంటూ హరికథలు చెప్పే ఎంతోమంది హీరోలకు భిన్నంగా పవన్ మాత్రం.. సినిమాల గురించి హైప్ క్రియేట్ చేసి గొప్పలు చెప్పుకునే వారు కాదు. ఇలాంటి ధోరణి మరింతగా ఆకట్టుకునేది. దానికి తోడు పొలంలో సాదాసీదా వ్యక్తి మాదిరి వ్యవసాయం చేసుకోవటం లాంటివి అందరికి భిన్నమైన ఇమేజ్ స్థిరపడేలా చేసింది.
ఓ పక్క మిలియన్ల కొద్దీ అభిమానులు దగ్గరైన వేళలోనే.. మీడియా మాత్రం దగ్గరకు రాలేనంత దూరంగా వెళ్లిపోవటం.. పవన్ ఇమేజ్ బిల్డింగ్ జరగకపోవటానికి ఒక ప్రధాన కారణంగా మారింది. దీనికి తోడు.. మెగాస్టార్ చిరు మీద ఎవరైనా చిన్నపాటి మాట అన్నా.. అంతులేని కోపాన్ని ప్రదర్శించటం పవన్ గురించి నెగెటివ్ ప్రచారానికి ఊతమయ్యింది. కేవలం సినిమాకు పరిమితమైన వేళలోనూ.. పవన్ కు దగ్గర కాని మీడియా.. తన సోదరుడు చిరు పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చిన వేళ.. చోటు చేసుకున్న పరిణామాలు అందరికి తెలిసిందే. అప్పటివరకు అందరివాడిగా.. మంచివ్యక్తిగా.. సున్నిత మనస్కుడిగా పేర్కొనే చిరంజీవి మీదనే ఎన్నెన్ని విమర్శలు.. ఎటకారాలు చేశారో తెలిసిందే.
వీటిని ‘రాజకీయం’గా ఎదుర్కొనే ‘నేర్పు’ విషయంలో ఆయన తప్పటడుగులు వేశారు. ఫలితంగా ఖాయమనుకున్న సీఎం పదవి అందని ద్రాక్షగా మారింది. అంచనాలు దారుణంగా దెబ్బతిని.. గుప్పెడు సీట్లకే పరిమతమయ్యారు. ఆ సమయంలోనూ భావజాలం.. సమాజం ఎలా ఉండాలన్న అంశాలే ఓటర్లకు ముఖ్యమనుకుంటారని... దాని మీదనే ఎక్కువ ఫోకస్ తప్పించి.. రాజకీయం అన్నది కూడికలు.. తీసివేతల సమాహారమని.. పావులు కదపటమే ముఖ్యమన్న విషయాన్ని మర్చిపోవటమే మెగాస్టార్ తప్పైంది. సంప్రదాయ రాజకీయాల్ని బద్ధలు కొట్టేయాలన్న తలంపుతో ఇండస్ట్రీకి వచ్చిన వేళలో.. తాను నమ్మిన మార్గంలో పయనించి విజయవంతమైన పవన్.. రాజకీయాల్లోకి వచ్చిన వేళలోనూ అదే బాటలో పయనించటం ఆయన చేసిన తప్పు. అప్పటికే తేడా కేసు అన్న ముద్రతో ఉన్న పవన్ ను ఆ పేరును కాస్త మార్చి తిక్క ఎక్కువ అన్న బ్రాండింగ్ చేయటం షురూ చేశారు. చంద్రబాబుతో పవన్ కలవడం చంద్రబాబుకంటే జగన్ కి ఎక్కువ ఉపయోగపడింది.
రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయి. డ్రాయింగ్ రూంలో కూర్చొని తమను పాలించేవాడు ఎలా ఉండాలని లెక్చర్లు ఇచ్చే ప్రజలు.. ఓటు వేసే సమయానికి తాను అనుకున్న సామాజిక లెక్కలకు అనుగుణంగా వేయాలని కొందరు.. తాను వేసే ఓటు గెలిచే పార్టీకే ఉండాలని మరికొందరు.. తాను ఓటు వేయటానికి తాను ఆశించిన తాయిలం తనకు అందిందా? లేదా? అన్నది చూసుకొని వేసే ఇంకొందరు.. ఇలా సంక్లిష్టంగా ఉంటుంది. అయితే.. ఇలాంటి వాటన్నింటికి తాము సిద్ధాంతానికి తగ్గట్లు పయనించాలన్న పట్టుదల.. చాలామంది పెదవి విరిచేలా చేయటమే కాదు.. వర్కువుట్ కాని వ్యవహారంగా మారింది.
అప్పటికే రాజకీయ ధోరణులు మారిపోవటం.. కులం.. వర్గం.. ప్రాంతం లాంటి వాటి విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని దరిద్రాలు కావాలో అన్ని దరిద్రాలు తయారయ్యాయి. అలాంటి వాటిని రాజకీయ ఆరోహణకు తమకు తగ్గట్లు వాడాలన్న సూచనలు చేస్తే.. సిద్ధాంత బలంగా వెళుతున్నప్పుడు.. ప్రజలు ఆశీర్వదిస్తారన్న మొండితనం ప్రాక్టికాలిటీని మిస్ అయ్యేలా చేసింది. ఇది కొంప ముంచటమే కాదు.. మరోసారి ఓటమిని తెచ్చి పెట్టింది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంటి వారు తిరుగులేని అధికారాన్ని చేతుల్లోకి తెచ్చుకోవటానికి ఎన్నేళ్లు పట్టిందో తెలిసిందే. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే 2014 ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఆయనకు ఉండేది కాదు. బలమైన సెంటిమెంట్ తో పాటు.. అప్పటికే ఎన్నో డక్కామొక్కీలు తిని రాటు తేలిన ఆయన.. చివరకు తాను అనుకున్న విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నోసార్లు పార్టీని మూసేయాలన్న ఆలోచనను భారీగా చేయటమే కాదు.. ఎన్నో అవమానాల్ని.. అవహేళనను ఎదుర్కొన్నారు. అంత పెద్ద ఉద్యమ వేళలోనూ.. ఆయన అరుదుగా మాత్రమే బయటకు వచ్చేవారన్నది మర్చిపోకూడదు. టీఆర్ఎస్ పెట్టిన నాటి నుంచి 2012 వరకు ఆయన బయటకు వచ్చేది చాలా తక్కువగానే. కాకుంటే.. బయటకు వచ్చిన ప్రతిసారి బలమైన సెంటిమెంట్ అస్త్రంతో రావటం.. ప్రత్యర్థులకు నోరు విప్పితే చాలు.. తెలంగాణ వ్యతిరేకి.. తెలంగాణ ద్రోహి అన్న ముద్ర వేసేలా డిజైన్ చేయటం.. ఆ భయానికి చాలా నోళ్లు మూతపడ్డాయని చెప్పాలి.
ఒక విధంగా చెప్పాలంటే.. తెలంగాణ సెంటిమెంట్ అనేది రక్షణ కవచంగా మారి కేసీఆర్ ను ఎంతలా రక్షించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ‘‘లక్’’ కూడా తోడు కావటంతో సమీకరణాలు మొత్తంగా మారిపోయాయి. పవన్ విషయంలో ఇలాంటి సానుకూలతలు లేకపోవటం.. కేసీఆర్ మాదిరి మంత్రించిన పుష్పాల మాదిరి ఉండని ఆయన ప్రసంగం.. ఎక్కడ ఆవేశ పడాలో.. ఎక్కడ ఆవేదనను ప్రదర్శించాలో.. లాంటి మతలబుల కంటే కూడా మనసు చెప్పినట్లుగా చేయటం.. సహజ భావవ్యక్తీకరణకు వెళ్లటం.. అది కాస్తా ఆయన్ను తిక్క నుంచి పిచ్చికి.. ఆ తర్వాత సైకోగా ముద్ర వేసింది.
ముందు నుంచే చెప్పినట్లు.. మీడియా దన్ను లేకపోవటం.. సోషల్ మీడియాలో వ్యూహాత్మక తప్పులు చేయటం.. సరైన మెంటార్ లేకపోవటం.. పక్కా రాజకీయ నేతలా పవన్ వ్యవహరించకపోవటం.. చాలా దెబ్బతీశాయి. ప్యాకేజీ స్టార్ అన్న ఆరోపణను వ్యూహాత్మకంగా తిప్పికొట్టడంలో జనసేన వ్యూహం తేలిపోయింది. చివరకు అది ఆయనకు గుది బండలా మారిందే తప్పించి.. అలాంటిదేమీ లేదన్న నిజాన్ని నిరూపించే విషయంలో జరిగిన వైఫల్యం.. మొత్తంగా పవన్ కల్యాణ్ అనే ‘తేడా’ కేసు.. పిచ్చోడి ముద్రను.. బలమైన బ్రాండింగ్ గా మార్చటంలో ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు.
చేతికి ఎముక లేకుండా చేసే దానాలతో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులకు గురి కావటం.. ఎన్నో పుస్తకాలు చదివినా.. దానికి సంబంధించిన మేధ పుష్కలంగా ఉన్నా.. దాన్ని ఆవిష్కరించే విషయంలో కేసీఆర్ కున్నంత నేర్పు పవన్ కు లేకపోవటం.. ఒక బలమైన సెంటిమెంట్ ను ఆయన తనకు రక్షణ కవచంలా మార్చుకోలేకపోవటం పవన్ ఫెయిల్యూర్ గా చెప్పాలి.
కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అనే అస్త్రం ఉంది. పవన్ కు ఏముంది? సుపరిపాలన.. రాజకీయాల్లో స్వచ్ఛంగా ఉండాలన్న కాలం చెల్లిన సిద్ధాంతాలు.. చివరకు తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్కడికి మందు సీసా కానీ.. వెయ్యి రూపాయిల డబ్బులు కానీ పంచనప్పుడు.. ఓట్లు ఎలా పడతాయి? నోటితో చెప్పే ఆదర్శాలు అక్కడికే సరిపెట్టాలని.. పోల్ మేనేజ్ మెంట్ అనేది ఉంటుందని.. ఆ పేరుతో చేయాల్సిన ఛండాలాలు ఎన్నో ఉంటాయని.. వాటన్నించిన చేస్తే కానీ ‘గెలుపు’ అనే మూడు అక్షరాలు సొంతమవుతాయన్న ప్రాథమిక విషయాన్ని పనికిమాలిన విషయంగా.. ఇప్పుడు కాకుంటే రాజకీయాల్ని ఎప్పటికి మారుస్తాం..? ఓడినా ఫర్లేదు.. సిద్దాంతం పక్కకు తప్పకూడదన్న మొండితనం.. మూర్ఖత్వంలా కనిపించటం తప్పు లేదు కదా?
రాజకీయాల్లో గెలుపు మాత్రమే మాట్లాడుతుందని..సిద్ధాంతాల మీదా.. విలువల మీద ఉండే కమిట్ మెంట్ కారణంగా ఓట్లు రాలవన్న ప్రాథమిక విషయాన్ని మర్చిపోవటం పవన్ చేసిన మరో పెద్ద తప్పుగా చెప్పాలి.
ఇలాంటివన్ని చూసినప్పుడు..తన ప్రత్యర్థుల్ని సైతం (తనను బండ బూతులు తిట్టే వారిని సైతం.. వారంతా తన రాజకీయ శత్రువులుగా ఉండదన్నట్లు వ్యవహరించే విచిత్ర గుణం..) ప్రత్యర్థులుగా చూసే ధోరణి లేని పవన్ పిచ్చోడే కదా? రాజకీయం చాలా అసహ్యంగా.. కరకుగా.. ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉంటాయన్న విషయాన్ని సింఫుల్ గా కొట్టేసే పవన్ లాంటి వారు తేడా కేసు కాక మరేంటి?
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం.. వారి తరఫున మాట్లాడటం.. వారి బతుకులు బాగు చేయాలన్న ఆలోచన మాత్రమే కాదు... ఏ వర్గం ఓట్లను ఎలా సొంతం చేసుకోవాలి? ఓటర్ల స్థానిక మనస్తత్వం, పోలింగ్ మెండ్ సెట్ అర్థం చేసుకోవడం, దాని కోసం వారిని ఎలా బుట్టలో వేసుకోవాలన్నదానిపై వ్యూహాత్మకంగా వ్యవహరించని ధోరణి ఆయన్ను తేడా కేసుగా మార్చింది. కేవలం విలువల గురించి మాత్రమే మాట్లాడితే అవే బలహీనుడ్ని చేస్తాయన్న సింఫుల్ విషయాన్ని గమనించని పవన్ పై పిచ్చోడు ముద్ర వేయడం అందరికీ సులువైంది.
మూడు పెళ్లిళ్ల టాపిక్ అన్నదే ముఖ్యం తప్పించి.. నిత్యం చేసే మానసిక వ్యభిచారం ఘోరమైన అపరాధంగా భావించని వారికి.. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవటాన్ని వేలెత్తి చూపించటంలో రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించే ప్రత్యర్థులందరి బట్టలు విప్పేలా.. వారి మాటలన్ని.. చెప్పేవి నీతులు.. దూరేది మాత్రం ‘... కొంపలు’ అన్నట్లుగా ఫాంహౌస్ ల్లో.. ఫైవ్ స్టార్ హోటళ్లలో.. ఖరీదైన క్లబ్బుల్లో విడిది చేసి రోజులు తరబడి ఎంజాయ్ చేసే వాస్తవాల్ని.. తన వాళ్ల చేత దుమ్మెత్తి పోయించే అలవాటు లేని పవన్ వారికి ప్రత్యర్థి కావల్సింది పోయి వారి చేతిలో ఆయుధం అయ్యాడు.
ఇంట్లో తల్లిని.. చెల్లిని .. భార్యను.. ఇష్టారాజ్యంగా అనేస్తున్నా.. నేను అనుసరించే విలువలకు భంగం వాటిల్లే ప్రసక్తే లేదనే మొండితనం.. ఆవేశాన్ని ఆవేశంగానే చూపిస్తాను తప్పించి.. దాన్నో దారి తప్పిన క్షిపణిగా మార్చి.. సమాజంలో చీలిక తెచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించని పవన్ వైఫల్యాన్ని చూసినప్పుడు అతను నిజంగానే పనికిమాలిన వ్యక్తి అని ముద్ర వేయడం ప్రత్యర్థులకు సులువే. సంచలనాలకుకేరాఫ్ అడ్రస్ గా మారే వారంతా.. పవన్.. గురించి మాట్లాడతారే తప్పించి.. మిగిలిన వారి విషయంలో ఆ దమ్మును ప్రదర్శించని వారి బతుకుల్ని బట్టబయలు చేసి.. వారి ప్యాకేజీలను బయటపెట్టడంలో జనసేన సక్సెస్ కాలేదు. 2014లో పవన్ చంద్రబాబు ఎంత మేర ఉపయోగపడ్డారో తెలియదు గాని ఆ పొత్తునే ప్రత్యర్థి పార్టీలు అద్భుతంగా వాడేసుకున్నాయి. ఇలాంటివి పటాపంచలు చేయడంలో పవన్ పట్టించుకోకపోవడం పవన్ కి తీరని నష్టం చేసింది.
వీటన్నింటికి తోడు పార్టీ నిర్మాణంలో సరైన మార్గదర్శకుడు లేకపోవడం, అలవిమాలిన అలసత్వం, ఆలస్యం... జనసేన తేలిపోవడానికి కారణమైంది. పవన్ కంటే ఎక్కువ పార్టీలతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ కు జరగని నష్టం పవన్ కి జరిగింది. దీనికి కారణం తనపై వచ్చే విమర్శలు, ఆరోపణలు సరైన సమయంలో తిప్పికొట్టడకపోవడమే కారణం.