Begin typing your search above and press return to search.

మహిళల ఆ కోరికను పురుషులు ఎలా గుర్తించాలంటే?

By:  Tupaki Desk   |   11 March 2020 3:51 AM GMT
మహిళల ఆ కోరికను పురుషులు ఎలా గుర్తించాలంటే?
X
రగిలిపోతున్న ‘బొమ్మాలి’ అంటూ ఎంతసేపు పురుషులు కలవరించడమేనా? మహిళలకు ఆ కోరికలు ఉండవా? వారికి మూడ్ రాదా? స్త్రీల కోరికలను పురుషులు ఎలా కనిపెట్టాలనే దానిపై ఇంతవరకూ క్లారిటీ లేదు. ఆడవారు పిలిస్తే వెళ్లడం తప్పితే.. వారి మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం.

కానీ తాజా పరిశోధనలో ఇక ఇంట్రస్టింగ్ అంశాన్ని పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. లైంగికంగా ప్రేరేపించే , ప్రేరేపించని మహిళలను వాసన ఆధారంగా పురుషులు గుర్తిస్తారని కెంట్ విశ్వవిద్యాలయం తేల్చింది. మహిళలు లైంగికంగా ప్రేరణకు గురైతే ఆ విషయాన్ని పురుషులు పసి గట్టగలరని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అంతేకాదు ఈ పరిశోధన లో శాస్త్రవేత్తలు పురుషుల కంటే మహిళలకే లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోధన లో గుర్తించారు. మగవాళ్లకు సెక్స్ ప్రేరణకు కేవలం రెండు మూడు కారణాలు కనపడితే మహిళలకు మూడ్ వచ్చేందుకు ఏకంగా 237 కారణాలు గుర్తించడం విశేషం.

పరిశోధన లో చెమట నమూనాల మహిళల ఆధారంగా లైంగిక సంకేతాలు గుర్తించారు. ఈ సంకేతాలను మగవాళ్లు గుర్తించి ప్రొసీడ్ అవ్వడమే.. కళ్ల ద్వారానే ఈ సంకేతాలు ఎక్కువగా కనపడుతాయట.. భాగస్వామి ఆకర్షనీయంగా ఉన్నప్పుడు తమకు సెక్స్ కోరికలు పెరుగుతాయని స్ర్తీలు చెబుతున్నారు.