Begin typing your search above and press return to search.

కరోనాను మన యాంటీబాడీస్ ఎలా ఎదుర్కొంటాయి?

By:  Tupaki Desk   |   7 May 2021 11:30 PM GMT
కరోనాను మన యాంటీబాడీస్ ఎలా ఎదుర్కొంటాయి?
X
ఇప్పుడు దేశాన్ని ఆవహించిన కరోనా మహమ్మారికి చికిత్సలు, మందులు అందుబాటులో లేకుండా పోవడంతో మన రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే బతికి బట్టకడుతాం. అది వీక్ గా ఉంటే ప్రాణాలు పోవడం ఖాయం. టీకా ఒక్కటే మార్గం.. అయితే ఆ టీకా అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.

ఎవరైనా కరోనా వైరస్ బారిన పడితే వెంటనే వారి రోగనిరోధక శక్తి ప్రతిస్పందించి యాంటీ బాడీస్ ను విడుదల చేస్తుంది. శరీరంలోకి చేరిన వైరస్ ను యాంటీ బాడీస్ ఎలా తటస్తీకరిస్తాయనే విషయాన్ని వివరిస్తూ తాజాగా ఆస్టిన్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు ఓ ఫొటోను తాజాగా విడుదల చేశారు.కోవిడ్ నుంచి కోలుకున్న నలుగురు వ్యక్తుల ప్లాస్మా శాంపిల్స్ ను పరిశీలించి ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ మానవ కణాలకు అతుక్కొని ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది. మానవ శరీరంలోని యాంటీబాడీలు ఈ ఆర్బీడీలనే లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తాయని ప్రయోగాలు నిరూపించాయి. అయితే తాజా పరిశోధన మరో విషయాన్ని తేల్చింది.

రక్తంలోని ప్లాస్మాలో ఉండే 84శాతం యాంటీబాడీస్ ఆర్.బీ.డీ వెలుపల ఉండే వైరల్ స్పైక్ ప్రోటీన్ ను టార్గెట్ చేస్తున్నాయని తేలింది. మొత్తం స్పైక్ ను యాంటీబాడీస్ టార్గెట్ చేసి దానిని న్యూట్రలైజ్ చేస్తున్నాయని మేం కనుగొన్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. దాంతో కరోనా అంతరిస్తుందని తేలిందని తెలిపారు.