Begin typing your search above and press return to search.

న‌మ్మేదెలా? దూర‌మ‌వుతున్న 'పెద్ద‌లు'

By:  Tupaki Desk   |   28 March 2022 4:30 PM GMT
న‌మ్మేదెలా?  దూర‌మ‌వుతున్న పెద్ద‌లు
X
ఔను! ఇప్పుడు ఇదే మాట వైసీపీలో వినిపిస్తోంది. ఏ పార్టీకైనా.. సీనియ‌ర్లు చాలా అవ‌స‌రం. స‌ల‌హ‌లు ఇవ్వడ‌మే కాదు.. పార్టీ క‌ష్ట‌కాలంలో ఆదుకునేందుకు సీనియ‌ర్ల పాత్ర అత్యంత కీల‌కం. అయితే.. వైసీపీలో సీనియ‌ర్ల‌కు ఎక్క‌డా ప్రాధాన్యం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. పార్టీలో ఏదో ఆశించి వ‌చ్చిన‌.. వారికి ఇప్పుడు ప‌రాభ‌వం ఎదుర‌వుతోంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఉదాహ‌ర‌ణ‌కు టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన సీనియ‌ర్లు.. దాడి వీరభ‌ద్ర‌రావు.. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో గ‌ట్టివాయిస్ వినిపించేవారు.

టీడీపీ హ‌యాంలో దాడి వీర‌భ‌ద్ర‌రావు ఒక సంచ‌ల‌నం. అనేక విశ్లేష‌ణ‌లు. .చేసేవారు. నిత్యం మీడియాలో నూ ఉండేవారు. అయితే.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న‌త‌ర్వాత‌.. ఆయ‌న‌లో వాయిస్ లేకుండా పోయింది. ఆయ‌న కుమారుడికి జిల్లా స్థాయి ప‌ద‌వి ఇచ్చార‌నే చ‌ర్చ ఉంది. దీంతో ఆయ‌న ఎక్క‌డా త‌న వాయిస్‌ను వినించ‌డం లేదు. అంతేకాదు... ఆయ‌న ఎప్ప‌టి నుంచో ఎమ్మెల్సీ కావాల‌ని కోరుతున్నారు. అయినా.. జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, కాంగ్రెస్‌లో ఉండ‌గా.. మంత్రిగా చక్రం తిప్పిన‌.. మ‌రో నాయ‌కుడు.. గాదె వెంక‌ట‌రెడ్డి.

ఈయ‌న కూడా రాజ‌కీయంగా అనేక అనుభ‌వాల‌ను సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాష్ట్ర విభ‌జ న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌ర్వాత‌..వైసీపీలో కాకుండా.. టీడీపీలోచేరారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల‌కుముందు.. బాప‌ట్ల అసెంబ్లీ స్థానాన్ని ఆశించ‌గా.. చంద్ర‌బా బు విముఖత వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో గాదె.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే. ఇక్క‌డా ఆయ‌న కు అనుకూల ప‌రిస్థితి ఏర్ప‌డ‌లేదు. ఆయ‌న కుమారుడిని ఎలివేట్ చేయాల‌ని అనుకున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు సాధించ‌లేక పోయారు.

వీరిద్ద‌రే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా.. అనేక మంది సీనియ‌ర్ నాయ‌కులు.. జ‌గ‌న్‌ను న‌మ్ముకుని.. వైసీపీలోకి వ‌చ్చారు. వీరిలో వైఎస్ అనుభ‌వం ఉన్న‌వారు... ఆయ‌న స‌మ‌కాలికులు కూడా ఉన్నారు. అయితే.. వీరిని జ‌గ‌న్ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

క‌నీసం.. ఎమ్మెల్సీ వంటి ప‌దవులు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం.. పార్టీలోనూ ప్రాధాన్యం లేకుండా చేస్తున్నార‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వారు... టీడీపీవైపు చూస్తున్నా ర‌ని తెలుస్తోంది. ఇలాంటి సీనియ‌ర్ల‌ను చేర్చుకునేందు కు చంద్ర‌బాబు కూడా రెడీగానే ఉన్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఎన్నిక‌ల‌కు ముందు ఇలాంటి మార్పులు వైసీపీకి ఇబ్బ‌దిక‌రంగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.