Begin typing your search above and press return to search.
పిల్లల్నే టార్గెట్ చేయాలని కొవిడ్ కు ఎలా తెలుసు?
By: Tupaki Desk | 15 Jun 2021 3:23 AM GMTమొదటి వేవ్ ముగిసింది. సెకండ్ వేవ్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు అందరి చూపు మూడో వేవ్ మీదనే. మొదటి.. రెండు వేవ్ లను చూసినప్పుడు కొవిడ్ ను ఎదుర్కొనే విషయంలో ప్రజలు.. ప్రభుత్వాలు స్పందించే తీరు.. అమలు చేసే విధానాల ఆధారంగానే మహమ్మారి తీవ్రత ఉంటుందే తప్పించి.. ప్రత్యేకంగా టార్గెట్ చేసిందంటూ ఏమీ ఉండదు. మొదటి వేవ్ కు చాలా రోజుల ముందే సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయటం.. రాకపోకల్ని పూర్తిగా అడ్డుకోవటంతో మొదటి వేవ్ తీవ్రత అంతగా కనిపించలేదు.
సెకండ్ వేవ్ విషయానికి వస్తే.. ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించకపోవటమే ఇంత తీవ్రతకు కారణంగా చెప్పాలి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటానికి కేంద్రం సిద్ధంగా లేకపోవటం.. రాష్ట్రాలు సైతం వేచి చూద్దామన్నట్లుగా వ్యవహరించటంతో పాటు.. రెండో వేవ్ తీవ్రతను ఎదుర్కోవటానికి సిద్ధంగా లేకపోవటం.. విపరిణామల్ని గుర్తించి.. అందుకు తగ్గ ఏర్పాట్ల దిశగా ప్రయత్నాలు జరగకపోవటంతో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.
కేంద్రం తీసుకునే నిర్ణయాల గురించి ఎదురుచూడకుండా.. తమకు ఎదురవుతున్న పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాన్ని రాష్ట్రాలు గుర్తించి.. అందుకు తగ్గట్లుగా వ్యవహరించేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. ఇదే సెకండ్ వేవ్ లో దారుణ పరిస్థితులకు కారణమైందని చెప్పాలి. మొదటి.. రెండో వేవ్ లు అయ్యాక వచ్చే మూడో వేవ్ లో పిల్లలు టార్గెట్ అవుతారని.. పెద్ద ఎత్తున కొవిడ్ బారినపడతారంటూ చేస్తున్న విశ్లేషణలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
ఈ వాదనలోనిజం ఎంత? కొవిడ్ పిల్లల్నే ఎందుకు టార్గెట్ చేస్తుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొదటి.. రెండు దశల్లో పిల్లల జోలికి వెళ్లని వైరస్ మూడో దశలో మాత్రం పిల్లల్ని టార్గెట్ చేయటం వెనుక లాజిక్ ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.దీనికి ప్రముఖ వైద్యులు.. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడో దశలో పిల్లలుటార్గెట్ ఎందుకు అవుతారన్న విషయాన్ని ఆయన సింఫుల్ గా తేల్చేశారు.
థర్డ్ వేవ్ సమయానికి పెద్దలు చాలావరకు కరోనా వ్యాక్సిన్ వేసుకొని ఉండటంతో వారిలో రక్షణ శాతం పెరిగే వీలుంది. అప్పటికి పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం లేని కారణంగా వారిపై మహమ్మారి విరుచుకుపడే వీలుందని.. అంతే తప్పించి.. థర్డ్ వేవ్ లో కావాలని కొవిడ్ పిల్లల్ని టార్గెట్ చేస్తుందన్న వాదనలోనిజం లేదని ఆయన చెబుతున్నారు. థర్డ్ వేవ్ సమయానికి పెద్దలుచాలామంది వ్యాక్సిన్ వేసుకొని ఉండటం వల్ల వారంతా వివిధ పనుల కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకోవటంతో ఆ ధీమా వేరుగా ఉంటుంది. దీనికి తోడు వ్యాక్సిన్ రక్షణ ఉంటుంది. కానీ.. పిల్లలకు అలాంటిదేమీ ఉండదు కాబట్టి పిల్లలకు సోకే అవకాశం ఉంది. అంతే తప్పించి..కొవిడ్ కు ప్రత్యేకంగా ఫలానా వారిని టార్గెట్ చేయాలన్నట్లు ఏమీ ఉందని చెబుతున్నారు. సో.. థర్డ్ వేవ్ వేళ పెద్దలు జాగ్రత్తగా ఉంటే పిల్లలకు సోకే అవకాశం తక్కువన్నది మర్చిపోకూడదు.