Begin typing your search above and press return to search.
బీజేపీలో ఈటల సర్దుబాటు ఎలా?
By: Tupaki Desk | 13 Nov 2021 9:36 AM GMTఅటు సీనియర్లు.. ఇటు సమకాలీకులు.. మధ్యలో జూనియర్లు.. తన నేపథ్యమేమో పూర్తి వామపక్షం, ఆపై తెలంగాణ ఉద్యమం. ఇక రాజకీయంగానూ దాదాపు 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకం.. ఏడేళ్లు మంత్రి పదవిలో.. ఇదంతా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ గురించేనని అందరికీ అర్థమై ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని, రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. ఎక్కువ శాతం మంది ఊహించినట్టే ఫలితం వచ్చింది. ఇదంతా గతం. ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణం కూడా అయిపోయింది. ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో ఈటలను ఎలా సర్దుబాటు చేస్తారనేదే? అసలు బీజేపీలో ఈటల ఇమడగలరా? అనే సందేహమూ ఉన్నా.. కష్ట కాలంలో అండగా నిలిచి, తనను ఆదుకున్న పార్టీని, అందులోనూ కేసీఆర్ నిర్బంధాలను ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లో ఆయన కమలం శిబిరాన్ని వీడతారని భావించలేం.
తెలంగాణలో అందరికీ తెలిసిన పేరు
ఈటల అంటే తెలంగాణలో తెలియని వారుండరు. టీఆర్ఎస్ మూల స్తంభాల్లో ఆయన ఒకరు. ఉద్యమ గుండెకాయ ఉస్మానియా వర్సిటీకి ఇప్పుడు వెళ్లినా కేసీఆర్ పై వ్యతిరేకత కనిపిస్తుందేమో కానీ, ఈటలపై మాత్రం వ్యతిరేకత ఉండదు. గ్రామ స్థాయిలోనూ రాజేందర్ కు నెటవర్క్ ఉందనేది వాస్తవం. తెలంగాణ బీసీ నేతల్లో ప్రస్తతం ఈటల ప్రముఖుడు అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
కాగా, టీఆర్ఎస్ లో పార్టీ పరంగా, ఉద్యమంలో, ప్రభుత్వ పరంగా పదవుల్లో ప్రాధాన్యం దక్కింది. అయితే, తర్వాత కాలం మారి, ఈటల టీఆర్ఎస్ నుంచి గెంటివేతకు గురయ్యారు. అనంతరం ఏ పార్టీలో చేరాలి? కొత్త పార్టీ పెట్టాలా? స్వతంత్రుడిగా పోటీ చేయాలా? అసలు కేసీఆర్ ధాటిని తట్టుకుని నిలవగలనా? అని ఇలా అనేక రకాల సందేహాల్లో ఉన్న ఈటలను బీజేపీ లాగేసుకుంది. ఇప్పడు ఇంతటి స్థాయి నాయకుడిని బీజేపీ ఎలా ఉపయోగించుకుంటుంది? అనేది ప్రశ్న.
ప్రముఖ నేతగా చూపుతూ..
ప్రముఖుల విశ్లేషణల ప్రకారం.. బీజేపీ ఈటల సేవలను పక్కాగా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఓ దశలో ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి దూకుడుగా ముందుకెళ్తారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే, అవన్నీ హుజూరాబాద్ గెలుపు అనంతరం ఊపులో వినిపించినవే. మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చినవారిని నేరుగా పల్లకీ ఎక్కించరు. సైద్ధాంతిక పార్టీ అయిన బీజేపీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈటలకు ఇది లేకపోయినా.. ప్రజా బలం తోడుండడం సానుకూలాంశం.
కాబట్టి ఆయనను ప్రముఖ నేతగా చూపుతూ రాష్ట్రమంతటా పర్యటింపజేయాలని భావిస్తోంది. తద్వారా తమ లక్ష్యమైన ‘‘తెలంగాణలో అధికారం’’కు చేరుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంచి దూకుడు మీద ఉన్నారు. పార్టీ అధినాయకత్వం దగ్గర ఆయనకు పలుకుబడి బాగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో నెంబర్2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటల్లోనే ఇది వ్యక్తమవుతుంటుంది. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం కేసీఆర్ ను ఆయన ప్రభుత్వాన్ని ఢీ అంటే ఢీ అంటున్నారు. వీరికి ఈటల తోడైతే తమకు తిరుగుండదని బీజేపీ అంచనా వేస్తోంది.
సీనియర్లు, జూనియర్ల వారథిగా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (61), సీహెచ్ విద్యాసాగర్ రావు (79), డాక్టర్ కె.లక్ష్మణ్ (65).. వీరంతా బీజేపీ రాష్ట్ర సీనియర్లు. ఈటల కంటే కూడా రాజకీయాల్లోకి ముందే వచ్చారు. ఇక సంజయ్ (50), అర్వింద్ (45), ఎమ్మెల్యేలు రాజాసింగ్ (44), రఘునందన్ రావు (53).. అటు వయసులోనూ ఇటు అనుభవంలోనూ ఈటల కంటే జూనియర్లు. అయితే, వీరికి రాజేందర్ చేరికతో బీజేపీ మనో బలం రెట్టింపైనట్లయింది.
ఇది రాష్ట్రంలో ఆ పార్టీ ఫేస్ వ్యాల్యూను పెంచే పరిణామమే. ఒకవేళ పార్టీ ఈటల సేవలను పెద్ద స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తే ఆయన వీరందరికీ మధ్య వారథిగా పనిచేయాల్సి ఉంటుంది. అంశాల వారీగా, ప్రశాంతంగా, కచ్చితంగా చెప్పగల నాయకుడిగా ఈటలకు పేరుంది. కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా ఆయన పనితీరు, కొవిడ్ అంటేనే వణికిపోయిన రోజుల్లో నేరుగా రోగుల వద్దకు వెళ్లి పరామర్శించిన ధైర్యం అందరికీ గుర్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని బీజేపీ ఈటలను ఎంత బాగా వినియోగించుకుంటుందో చూడాలి.
ఇక వీరి తరమే
రాష్ట్ర బీజేపీలో భవిష్యత్ తరం నాయకత్వం అంటే ఈటల, సంజయ్, అర్వింద్, రఘునందన్, రాజాసింగే. వచ్చే పదేళ్లు పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సింది వీరే. ఈ దిశగా ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. ఎప్పటికప్పడు ప్రభుత్వ విధానాల పరంగా ఉద్యమించడం, కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ మద్దతు పొందడం ఇందులో కీలకం.
కేసీఆర్ ను తట్టుకుంటారా? రేవంత్ ముందు నిలుస్తారా?
ప్రస్తుత తరం బీజేపీ నాయకత్వంలో దూకుడుకు కొదవ లేదు. కావాల్సింది కొత్త కొత్త వ్యూహాలే. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం వెనుకబడింది అని చెప్పడంలో సందేహం లేదు. దీనికి ఉదాహరణ.. ప్రస్తుతం నెలకొన్న ధాన్యం వివాదం. అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను వివరిస్తూ టీఆర్ఎస్ సర్కారును నిలదీయాల్సిన సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మెతకగా మిగిలిపోయింది.
ఇక సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వాగ్ధాటికి ఎదురు నిలవడం కూడా కొంత కష్టమే. ఆకట్టుకునేలా మాట్లాడడంలో వీరిది అందవేసిన చేయి. మరోవైపు ఇలాంటి పాయింట్లను పట్టుకుని ప్రభుత్వాన్ని నేరుగా కడిగేయడంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుంటారు. తనదైన శైలిలో ఆయన చేసే ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకోవడమే కాదు.. నిజమే అనే భావనను కూడా కలగజేస్తాయి.
కొన్నిసార్లు రేవంత్ ఆధారాలు సహా బయటపెట్టే అంశాలు ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోకుండా చేస్తాయి. ప్రత్యర్థి పార్టీల్లోని ఇలాంటి నాయకులను ఎదుర్కొంటూ ముందుకు సాగాలంటే రాష్ట్ర బీజేపీ తగినట్లుగా సిద్ధం కావాలి. సరిగ్గా చెప్పాలంటే.. 20 ఏళ్లు టీఆర్ఎస్ లో క్రియాశీలంగా పనిచేసిన, ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఈ విషయంలో బీజేపీకి తురుపుముక్క. గులాబీ దళం గుట్టుమట్లను విప్పడంలో, ప్రభుత్వ విధాన నిర్ణయాల లోపాలను ప్రజల ముందుంచి ఎండగట్టడంలో బీజేపీకి ఆయన చాలా కీలకం. అయితే, ఆయనను ఎలా ఉపయోగించుకుంటారన్నది ఆ పార్టీ చేతుల్లోనే ఉన్నది.