Begin typing your search above and press return to search.
టీడీపీకి కాంగ్రెస్ కన్నా.. బీజేపీ ఎలా బెటర్..?
By: Tupaki Desk | 20 Jan 2023 11:30 AM GMTఅవును..! టీడీపీ ఇప్పుడు ఎటు చూస్తున్నా.. బీజేపీనే కనిపిస్తోంది. కానీ.. బీజేపీ మాత్రం దిక్కులు చూస్తోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై కాషాయ దళం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఈ క్రమంలో నే ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుని ఏడాదిన్నర ముందే..రాజకీయంగా వేడిని రగిలించాలని భావిస్తున్న టీడీపీకి ఇబ్బందికర పరిణామాలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఏదో ఒకటి తేలిపోతుందని అనుకున్న ప్రతిసారీ.. పొత్తులపై సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ క్రమంలోనే అసలు కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు? అనేది ప్రశ్న. 2018లో టీడీపీ తెలంగా ణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగింది. దీనివల్ల పార్టీ కోల్పోయింది లేదు.. గెలిచిన స్థానాలు కూడా ఉన్నాయి. అయితే.. ఇదే ఫార్ములానుఏపీలో అమలు చేస్తే.. కాంగ్రెస్ సానుభూతి పరుల ఓటు బ్యాంకు టీడీపీకి ప్లస్ అవుతుందనేది పరిశీలకుల మాట.
ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్ర కూడా పార్టీని పుంజుకునేలా చేసింది. దీంతో ఏపీలోనూ కాంగ్రెస్ సానుకూలత పెరిగింది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌వైపు ఎందుకు చూడడం లేదనేది ప్రశ్న. అయితే.. బీజేపీ మరోసారి కేంద్రంలోపాగా వేసే అవకాశం ఉండడమే దీనికి కారణంగా కనిపిస్తోందన్నది పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కనుక కేంద్రంలో పాగా వేసే పరిస్థితి ఉంటే.. చంద్రబాబు వదులుకోరని అంటున్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ ఏపీలో ఒంటరిపోరుకు రెడీ అయింది. ఇప్పటికి రెండు సార్లు పార్టీ ఏపీచీఫ్ గిడుగు రుద్రరాజు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏపీలో పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అన్నారు. అయితే.. ఇక్కడ ఆయన పొత్తులకు వ్యతిరేకమని చెప్పలేదు.కానీ, కలిసి వచ్చే పార్టీలు కరువయ్యాయనేది మాత్రం నిజం.
నిజానికి టీడీపీ కనుక కాంగ్రెస్‌తో చేతులు కలిపి.. ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే.. ఫలితం ఉంటుందనేది కొందరు చెబుతున్న మాట. ఏదేమైనా బీజేపీ కోసం ఎదురు చూడడంలోనే టీడీపీ కాలం కరిగిపోతోందనేది వాస్తవం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.