Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి లక్ ఇలా ఉంది

By:  Tupaki Desk   |   31 May 2019 12:00 PM GMT
కిషన్ రెడ్డి లక్ ఇలా ఉంది
X
నువ్వు ఎన్ని గోల్స్ పెట్టుకుని అయినా ముందుకెళ్లు ... ప్రపంచం నీకు కొత్త దారులు చూపిస్తూనే ఉంటుంది. ఎన్నో ఆశ్చర్యాలను కలిగిస్తూ ఉంటుంది. లేకపోతే... ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పోయి హోం శాఖ (సహాయమే కావచ్చ) మంత్రి కావడం ఏమిటి? ఇదంతా ఒక ఎత్తు అయితే... కిషన్ రెడ్డికి ఒక అదనపు అదృష్టం కూడా దక్కింది. ఈరోజుల్లో బీజేపీకి మోడీ ఎంతో... మోడీకి అమిత్ షా అంత. అమిత్ షా ఎలాంటి వాడన్న వాదన పక్కన పెడితే పార్టీలో ఎంత పవర్ ఫుల్ అన్నది ఇంపార్టెంట్. అమిత్ షా తలచుకుంటే పార్టీలో జరగనిది ఏముంది. అలాంటి వ్యక్తి శాఖలో పడ్డారు కిషన్ రెడ్డి.

తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నది హైదరాబాదులో. తెలంగాణలో కిషన్ రెడ్డి 40 సంవత్సరాలుగా బీజేపీలోనే కొనసాగుతుంది. జస్ట్ ఏడాది క్రితం వరకు తిరుగులేని శక్తిగా మారిన కేసీఆర్ సర్కారుకు పిపీలకంలా కనిపించిన కిషన్ రెడ్డి విశ్వరూపం చూస్తున్నారు కేసీఆర్. ఆడెవడు, ఈడెవడు అన్న సందే... కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా గౌరవించాల్సిన హోదా పొందారు. అంటే తిట్టిచ్చుకున్న చోటే ముద్దు పెట్టించుకున్నాడు. అదే సమయంలో ఇప్పటికే కిషన్ రెడ్డి బీజేపీకి తెలంగాణలో పర్యాయపదంగా మారిన నేపథ్యంలో కీలకమైన హోంశాఖలో పడటంతో పార్టీపై మరింత పట్టురానుంది. భవిష్యత్తులో బీజేపీ ఆడే గేములో రాష్ట్రంలో చక్రం తిప్పడానికి కిషన్ రెడ్డికి ఇది అద్భుతమైన అవకాశం. బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం లభించడం ఒకరకంగా అసద్ సోదరులకు కూడా ఝలక్ అని చెప్పాలి. గుజరాత్ అల్లర్లకు కారకుడు అమిత్ షాయే అన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన చేతిలో హోంశాఖ పడటం, దాని సహాయమంత్రిగా అగ్రెసివ్ పొలిటీషియన్ కిషన్ రెడ్డి కావడం సాధారణ విషయం ఏమీ కాదు. ఏమైనా అసద్ సోదరులు ఒకింత జాగ్రత్త పడాల్సిన రోజులు వచ్చేశాయి.

ఇదిలా ఉండగా... కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయమంత్రి పదవి ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ముందే ప్రచారం జరగడంతో అసలు ఈ లీకు ఎక్కడిది అని పార్టీ ఆరాతీసిందట. అయితే.... జస్ట్ కొన్ని గంటల ముందే కావడంతో అది రచ్చకాలేదు. లేకపోతే చేతికి వచ్చిన కూడా నోటికి అందకుండా పోయేది. కిషన్ రెడ్డి... ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో చాలా దగ్గరగా మెలిగాడని తెలుస్తోంది. గతంలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేశారు. అపుడు మోడీని కిషన్ పలుమార్లు కలిశారు. కిషన్ రెడ్డి యాక్టివ్ నెస్ ని మోడీ బాగా ఇష్టపడేవారట. తదనంతర కాలంలో బీజేపీ జాతీయ నేతల పర్యటనల్లో మోడీతో కిషన్ రెడ్డి రూమ్ షేర్ చేసుకున్నారట. దాంతో అప్పటి నుంచే మోడీ మనసులో ఉన్నారు కిషన్ రెడ్డి. ఇపుడు కనుకు నిరూపించుకుంటే భవిష్యత్తులో కిషన్ రెడ్డి తెలంగాణలో భారీ అదృష్టాన్ని దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు.