Begin typing your search above and press return to search.

శ్రద్ధా వాకర్ ను హత్య చేసినోడి పరిస్థితి జైల్లో ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   22 Dec 2022 12:30 AM GMT
శ్రద్ధా వాకర్ ను హత్య చేసినోడి పరిస్థితి జైల్లో ఎలా ఉందంటే?
X
తనను నమ్మి వచ్చిన యువతిని ప్రియుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సహజీవనం చేస్తూ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో శద్ధాకపూర్ అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పునావాల్ దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పారేశాడు.

తన కూతురు నుంచి కొద్దిరోజులుగా ఫోన్ కాల్ రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రద్దా వాకర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో అఫ్తాబ్ వాలాను విచారించగా అసలు విషయం వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. ఈ కేసులో భాగంగా కోర్టు అతనికి రిమాండ్ విధించగా పోలీసులు అతడిని తీహార్ జైలుకు తరలించారు.

ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న అఫ్తాబ్ ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదని.. రోజంతా ముభావంగానే ఉంటున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు. తన కుటుంబ సభ్యులను సైతం కలుసుకునేందుకు అప్తాబ్ ఆసక్తి చూపించడం లేదని వెల్లడించారు. జైల్లోని తన సెల్ లో పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నాడని చెబుతున్నారు.

తీహార్ జైల్లోని ఖైదీలకు వారంలో రెండు రోజులు తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది. అలాగే వారం రెండు రోజులు ఐదు నిమిషాల తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తారు. అయితే ఇందుకోసం రాతపూర్వకంగా సదరు వ్యక్తులు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.

అలాగే అఫిడవిట్ మీద సంతకం చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికి వరకు అఫ్తాబ్ తన కుటుంబ సభ్యులు.. స్నేహితుల జాబితాను అధికారులకు ఇవ్వలేదని వారంటున్నారు. ఎవరితో మాట్లాడకుండా ఉంటున్న అఫ్తాబ్ కు జైలు అధికారులు కొన్ని పుస్తకాలు ఇచ్చారు.

అమెరికన్ రచయిత పాల్ థెరౌక్స్ ట్రావెల్ లాగ్ అయిన ‘ది గ్రేట్ రైల్వే బజార్’ పుస్తకాన్ని ఇవ్వగా మరికొన్ని నవల్స్ కావాలని అఫ్తాబ్ అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఈ నవల్స్ ను రోజంతా చదువుతూ తన సెల్ లోనే అఫ్తాబ్ గడుపుతున్నాడని అధికారులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.