Begin typing your search above and press return to search.

ఐసిస్.. బక్రీద్ ఇలా చేసుకుంది!

By:  Tupaki Desk   |   14 Sep 2016 3:25 AM GMT
ఐసిస్.. బక్రీద్ ఇలా చేసుకుంది!
X
తాము చేసే పనికిమాలిన పనులను, అత్యంత దారుణమైన తమ చేష్టలను వీడియోలు తీయడం, అనంతరం ఆన్ లైన్ లో పోస్ట్ చేయడం ఐసిస్ ఉగ్రవాదుల నిత్యకృత్యాల్లో ఒకటి. చిన్నపిల్లలల్తో తుపాకులు కాల్పించినా, బందీలుగా ఉన్న మహిళలపట్ల రాక్షసంగా వ్యవహరించినా, వరుసపెట్టి తలలు నరుక్కుంటూ పోయినా అది వెంటనే వీడియో తీయడం, ఆన్ లైన్ లో పొస్ట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో బక్రీద్ పండుగను కూడా అత్యంత దారుణమైన విధంగా వారు జరుపుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ వేడుకులు జరుపుకొంటున్న తరుణంలో... ఐసిస్ ఉగ్రవాద సంస్థ కూడా తనదైన శైలిలో ఈ వేడుకను జరుగుపునే క్రమంలో దారుణానికి ఒడిగట్టింది. ఈ వేడుకల్లో గొర్రెలకు బదులు తమవద్ద ఉన్న బందీల పీకలు కోసి ఆ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలోని ఒక జంతువధ శాలలో షూట్ చేసినట్లు ఐసిస్ చెబుతోన్న ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఒక భారీ కాయుడైన జిహాదీ.. బందీలను గొర్రెల్లా వేళాడతీసుకుని వెళ్లి దారుణంగా హతమార్చాడు. గొర్రెలను వేలాడదీసే కొక్కేలకు బందీలను తలకిందులుగా వేలాడదీసి, పదునైన కత్తితో పీకలుకోశాడు.

ఈస్థాయిలో ఆ రాక్షసులకు బలైన బందీలంతా సిరియాలో అమెరికా సైన్యాల కోసం గూఢచర్యం చేసి పట్టుబడ్డవారని, అందుకే ఈ నరికివేత వీడియోకు "మేకింగ్ ఆఫ్ ఇల్లూషన్" అనే పేరు పెట్టినట్లు ఐసిస్ పేర్కొంది. ఇది ఐసిస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన వీడియో అని సిరియన్ హక్కుల కార్యకర్త అబూ మొహమ్మద్ అంటున్నారు. 12 నిమిషాల నిడివిగల వీడియోలో ఈ దారుణాలో పొందుపరచబడ్డాయి.