Begin typing your search above and press return to search.

కార్పొరేట్ పన్నును ఎంజాయ్ చేసేది కంపెనీలేనట

By:  Tupaki Desk   |   24 Sep 2019 5:48 AM GMT
కార్పొరేట్ పన్నును ఎంజాయ్ చేసేది కంపెనీలేనట
X
కార్పొరేట్ రంగాన్ని ఉత్తేజితం చేసేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ పన్నుకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. భారీ ఎత్తున తగ్గించిన కార్పొరేట్ పన్ను ప్రయోజనాలు సామాన్యుల దరికి చేరే అవకాశం ఉందా? అంటే.. నో అని చెప్పేస్తున్నారు.

కార్పొరేట్ పన్నును తగ్గించటం ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాల్ని వినియోగదారులకు బదలాయించే కన్నా.. కంపెనీలు ఆ ప్రయోజనాల్ని తమ దగ్గర ఉంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రకటన చేసిన వెంటనే.. కంపెనీలకు కలిగే ఆర్థిక ప్రయోజనాల్లో అంతో ఇంతో వినియోగదారులకు బదిలీ చేస్తారని ఆశించారు. కానీ.. ఆ అంచనా అత్యాశే అన్న విషయాన్ని కోటక్ ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక స్పష్టం చేస్తోంది.

కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రయోజనాల్ని పూర్తిగా కంపెనీలే అనుభవించనున్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి పన్ను తగ్గింపు రూపంలో అందే ప్రయోజనాల్ని తమ వ్యాపారాన్ని పెంచుకోవటానికి వీలుగా ఉపయోగించుకుంటాయే తప్పించి.. ఇంకెవరికీ లాభం చేకూర్చరని చెబుతున్నారు. సో.. నిర్మలమ్మ తగ్గించిన కార్పొరేట్ పన్ను సామాన్యుల కాదు.. కేవలం కంపెనీలకేనన్న విషయం కొటాక్ నివేదికతో మరింత స్పష్టమైందని చెప్పక తప్పదు.