Begin typing your search above and press return to search.

కరోనా యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి..!

By:  Tupaki Desk   |   25 March 2021 11:30 PM GMT
కరోనా యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి..!
X
ఒక్కసారి కరోనా వచ్చాక మనిషి శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారి కరోనా వస్తే.. కేవలం ఆరునెలలు మాత్రమే శరీరంలో యాంటీబాడీలు ఉంటాయని.. ఆ తర్వాత మళ్లీ కరోనా సోకే అవకాశం ఉందని వైద్యులు ఇప్పటివరకు చెప్పేవారు. దీంతో కరోనా ఓ సారి సోకినా.. మళ్లీ వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇదిలా ఉంటే కరోనాకు సంబంధించిన యాంటీబాడీలు శరీరంలో పదేళ్లపాటు ఉండొచ్చని ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. అంటే ఒక్కసారి కరోనా సోకితే మళ్లీ పదేళ్ల వరకు ఆ వ్యక్తికి పదేళ్ల పాటు కరోనా రాదు.

అయితే ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనాపై రోజుకో పరిశోధన వెలుగు చూస్తున్నది. గతంలో కరోనా యంటీబాడీలు ఆరునెలలు మాత్రమే ఉంటాయని పరిశోధకలు తేల్చారు. తాజాగా మరో కొత్త విషయం వెలుగుచూసింది.ఈ మేరకు లన్సెట్​ మైక్రోబ్​ అనే సంస్థ ఓ పరిశోధన నిర్వహించింది.అయితే యాంటీబాడీలు ఎంతకాలం శరీరంలో ఉంటాయి? అనే విషయం సదరు వ్యక్తి రోగనిరోధక శక్తి, శరీర పనితీరుమీద ఆధారపడి ఉంటుందని లాన్సెట్​ మైక్రోబ్​ నివేదిక తెలిపింది.కరోనా నుంచి కోలుకున్నాక న్యూట్రలైజింగ్​ యాంటీబాడీస్​ తక్కువస్థాయిలో ఉత్పత్తయినా టీ సెల్స్​, రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేస్తే వారికి మళ్లీ కరోనా సోకదని పేర్కొన్నది.

మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 50 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవేళ కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ఎన్నికలు నిర్వహిస్తారా? లేక వాయిదా వేస్తారా? అన్న విషయం వేచిచూడాలి.అయితే తెలంగాణలోనూ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది.