Begin typing your search above and press return to search.
భూమి మీద ఉన్న చీమలు ఎన్ని.. వాటి బరువు లెక్క తెలుసా?
By: Tupaki Desk | 22 Sep 2022 2:30 AM GMTకొన్ని అంశాల మీద అంత ఎక్కువగా ఫోకస్ చేయాలా? అనిపిస్తుంది. కానీ.. లోతుల్లోకి వెళితే.. అలాంటి వాటిల్లోకి వెళితే.. వచ్చే సమాచారం ఆసక్తికరంగానే కాదు.. ఎంతో ఆశ్చర్యాన్ని ఇస్తూ ఉంటుంది.
ఆ ఇల్లు ఈ ఇల్లు అని లేకుండా ప్రపంచం మొత్తమ్మీదా చీమలు లేని ఇల్లు అంటూ ఒక్కటంటే కూడా ఉండదేమో. ఏ మూలన చూసినా.. చీమలు కనిపించకుండా ఉండని ప్రదేశం ఉండదు. ఒకవేళ.. అస్సలు లేవని అనుకుంటే.. ఏదైనా ఆహారాన్ని ఎక్కడైనా వదిలేస్తే.. రెండు రోజుల్లో ఎక్కడి నుంచి వస్తాయో తెలీనట్లుగా చీమలు వచ్చేయటం తెలిసిందే.
ఇంతకీ భూమి మీద ఎన్ని చీమలు ఉంటాయి? అన్న లెక్కకు సంబంధించిన ఆసక్తికర వివరాలు.. విషయాలు బయటకు వచ్చాయి. భూమి మీద ఉన్న చీమల గురించి దాదాపు 489 అధ్యయనాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ మొత్తం అధ్యయనాల సారాంశాన్ని చూస్తే.. భూమి మీద మొత్తం చీమల సంఖ్య దగ్గర దగ్గర 20 పక్కన 15 సున్నాలు.. అంకె రూపంలో చెప్పాల్సి వస్తే.. 20 క్వాడ్రిలియన్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదంతా ఒక అంచనా మాత్రమే అని.. కచ్చితమైన సంఖ్యను చెప్పలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు.
తాజాగా హాంకాంగ్ కు చెందిన కొందరు పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా ఉండే చీమల సంఖ్యపైన అధ్యయనం చేశారు. తమ పరిశోధనలో భాగంగా ఏకంగా 489 అధ్యయనాల్ని పరిశీలించటం గమనార్హం. వీరి పరిశోధన తాజాగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి. చీమలు సర్వవ్యాప్తి చెందటంతో చాలామంది వీటి సంఖ్యను కచ్ఛితంగా చెప్పలేని పరిస్థితిగాచెబుతున్నారు.
అయినప్పటికీ ఇంతకు ముందున్న డేటాతో కలిసి కసరత్తు చేసి.. ఈ ఫిగర్ ను తేల్చినట్లుగా చెబుతున్నారు.ఈ చీమలకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రపంచంలోని చీమలు మొత్తాన్ని ఒక కుప్పగా వేసి వాటి బరువు వేస్తే.. దగ్గర దగ్గర 12 మిలియన్ టన్నులుగా తేల్చారు.
ఇక్కడ ట్విస్టు ఏమంటే.. అడవుల్లో నివసించే పక్షలు.. క్షీరదాల మొత్తం బరువును లెక్కిస్తే..అది మొత్తం చీమల బరువులో కేవలం 20శాతం కంటే తక్కువగా ఉండటం విశేషం. చీమలా.. మజాకానా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.