Begin typing your search above and press return to search.

ప్రపంచంలో ఒక నిముషానికి ఎన్ని కరోనా కేసులు నమోదు అవుతున్నాయంటే ?

By:  Tupaki Desk   |   18 Nov 2020 7:00 AM GMT
ప్రపంచంలో ఒక నిముషానికి ఎన్ని కరోనా కేసులు నమోదు అవుతున్నాయంటే ?
X
కరోనా వైరస్ ... ఈ మహమ్మారి అప్పుడే తోలి బర్త్ డే ను కూడా జరుపుకుంది. కానీ, మహమ్మారి జోరుకి బ్రేకులు వేయలేకపోతున్నారు. వైరస్ వెలుగులోకి వచ్చిన ఏడాది దాటిపోయినా, భయం రోజురోజుకి పెరుగుతుంది తప్ప, తగ్గడం లేదు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంకా కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. అయితే , కరోనా కి భయపడి అలాగే ఉంటే ... ఆకలి చావులు పెరిగే అవకాశం ఉన్న కారణంగా అలాగే కాలం గడుపుతున్నారు. కరోనా కోరల్లో చిక్కుకొని ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే కరోనా ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఉన్నవారి నుండి లేనివారి వరకు, చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ కూడా కరోనా భారిన పడుతున్నారు.

ఇకపోతే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ప్రపంచంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 5.60 కోట్లు నమోదయ్యాయి. ఇక కరోనా మహమ్మారి భారిన పడి మరణించిన వారి సంఖ్య 13.42 లక్షలు దాటింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు విదిస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రపంచంలో ప్రతి నిమిషానికి 370 కొత్త కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రతి నిమిషానికి కరోనాతో ఏడుగురు మరణిస్తున్నారు. ప్రపంచంలో నిన్న ఒక్కరోజు 5,34,870 కేసులు నమోదు కాగా, కరోనాతో 10,230 మంది మరణించారు.

ఇక దేశంలో గత 24 గంటల్లో 38,617 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,12,908 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 44,739 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 474 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,30,993 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 83,35,110 మంది కోలుకున్నారు.