Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ ఎన్నిరోజుల తర్వాత పని చేస్తుంది?
By: Tupaki Desk | 11 March 2021 8:15 AM GMTదేశంలో రెండో విడత వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటికే వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాక శరీరంలో ఎంత కాలానికి యాంటి బాడీలు ఉత్పత్తి అవుతాయి అనే విషయంపై ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొన్నది.ప్రస్తుతం మనదేశంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగతున్నది. రోజుకు 20 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. చాలా మంది వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వెంబడే మాస్కులు తీసేస్తున్నారు. భౌతిక దూరం అనే మాట మరిచిపోయి.. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అయితే ఇది చాలా డేంజర్ అని చెబుతున్నారు వైద్యులు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 15 రోజుల అనంతరం శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి కావడం మొదలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. అప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతందని వాళ్లు అంటున్నారు. అయితే కేవలం రెండో డోసు తీసుకున్నాక మాత్రమే రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి అప్పటివరకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
సెల్యులార్ ఇమ్యూనిటీ రెస్పాన్సేస్ వలన కొద్దిమేర వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాక్సిన్ కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేస్తుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవాళ్లు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. ఇదిలా ఉంటే మనదేశంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇంకా తీవ్రత తగ్గలేదు. చాలా రాష్ట్రాల్లో ఇంకా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది.