Begin typing your search above and press return to search.

అల‌ర్ట్ః అతిగా సెల్ ఫోన్ వాడితే ఇన్ని రోగాలా..?

By:  Tupaki Desk   |   24 May 2021 2:30 AM GMT
అల‌ర్ట్ః అతిగా సెల్ ఫోన్ వాడితే ఇన్ని రోగాలా..?
X
సెల్ ఫోన్ లేకుండా బ‌త‌క‌లేం అని చెప్పేవారి సంఖ్య కోట్ల‌లోనే ఉంది. ఇలాంటి వాళ్ల వాడ‌కం ఉలా ఏంటేందంటూ.. ఫోన్ కు నోరుంటే శాప‌నార్థాలు పెట్ట‌డం గ్యారంటీ. అంత‌గా.. గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్లోనే త‌ల పెట్టేస్తారు. దీనివ‌ల్ల ఫోన్ లైఫ్ దెబ్బ‌తిన‌డం ఒకెత్త‌యితే.. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్ర‌భావాలు చూపుతున్న‌ట్టు చెబుతున్నారు నిపుణులు. ఫోన్ ఒక‌టికాక‌పోతే మ‌రొక‌టి కొంటారేమో.. మ‌రి ఆరోగ్యం అలా కాదుగ‌దా.. అందుకే బీ కేర్ ఫుల్ అంటున్నారు. మ‌రి, ఇంత‌కీ ఆ రోగాలు ఏంటో చూద్దామా

స్మార్ట్ ఫోన్ పింకీః ఇప్పుడు మొత్తం స్మార్ట్ యుగ‌మే. అంత‌టా ట‌చ్ తోనే ప‌ని. ఈ ట‌చ్ కోసం ఒకే వేలును వాడుతుంటారు చాలా మంది. ఇలా గంట‌ల త‌ర‌బ‌డి నొక్కుతూ ఉంటే వేలు వంక‌ర‌పోయే ప్ర‌మాద ఉంద‌ట‌. అందువ‌ల్ల అతిగా ఫోన్ వాడొద్ద‌ని చెబుతున్నారు.

టెక్స్ట్ నెక్ః చాలా మంది ఫోన్ చేతిలో పెట్టుకొని త‌ల వంచి ఫోన్ చూస్తుంటారు. త‌ల ఫోన్లో పెట్టారంటే.. ఎంత సేప‌వుతుంద‌న్న‌ది తెలియ‌కుండా అందులోనే మునిగిపోతారు. ఇలాంటి వారికి మెడ‌, భుజాల్లో తీవ్ర‌మైన పెయిన్ వ‌స్తుంది. దీన్నే టెక్స్ట్ నెక్ అంటారు. దీన్ని లైట్ తీసుకుంటే.. భ‌విష్య‌త్ లో చాలా పెద్ద స‌మ‌స్య అవుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

సెల్ ఫోన్ ఎల్బోః చాలా మంది అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. దీనివ‌ల్ల మోచేతి వ‌ద్ద కండ‌రాలు బిగుసుకుంటాయి. ఇందులో ‘అల్న‌ర్‌’ అనే నరం మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీనివల్ల మోచేతి నుంచి అరచేతి వరకు నొప్పి, మంట, స్పర్శ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

టెక్స్ట్ క్లాః ఇవాళ స్మార్ట్ ఫోన్ ఎంత పెద్ద‌గా ఉంటే.. అంత గొప్ప‌గా భావిస్తున్నారు జ‌నాలు. ఇలా పెద్ద పెద్ద ఫోన్ల వ‌ల్ల అవి చేతిలో స‌రిగా ఇమ‌డ‌వు. గంట‌ల త‌ర‌బ‌డి అలాంటి ఫోన్ పట్టుకోవ‌డం వ‌ల్ల అసౌక‌ర్యం క‌లిగి, అది ముదిరితే అనారోగ్యానికి దారితీస్తుంది. సుదీర్ఘ కాలం కొన‌సాగితే.. కండ‌రాలు చాలా బ‌ల‌హీనం అవుతాయి.

చూశారా.. ఎన్ని స‌మ‌స్య‌లో? ఇవ‌న్నీ కొత్త‌వి. ఇంకా పాత‌వి, మీకు తెలిసిన‌వి చాలా ఉంటాయి. నిద్ర లేక‌పోవ‌డం, క‌ళ్లు దెబ్బ‌తిన‌డం వంటి లిస్టు పెద్ద‌దేఉంది. అందువ‌ల్ల అతికి దూరంగా ఉండ‌డం అన్నింటికీ శ్రేయ‌స్క‌రం.