Begin typing your search above and press return to search.

ఓవ‌ర్ ‘స్మార్ట్ః’ జ‌నం రోజుకు ఎన్ని గంట‌లు ఆన్లైన్ లో ఉంటున్నరో తెలుసా?!

By:  Tupaki Desk   |   4 Aug 2021 5:30 PM GMT
ఓవ‌ర్ ‘స్మార్ట్ః’  జ‌నం రోజుకు ఎన్ని గంట‌లు ఆన్లైన్ లో ఉంటున్నరో తెలుసా?!
X
‘‘స్మార్ట్ ఫోన్ లేక‌పోతే.. ఈ ప్ర‌పంచం ఏమైపోతుంది?’’ ఈ మాట‌నే చాలా మంది జీర్ణించుకోలేని ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. ఫోన్ అంటే.. కాల్స్ చేసుకోవ‌డానికి అన్న రోజులు ఎప్పుడో పోయాయి. మ‌నీ ట్రాన్సాక్ష‌న్స్ నుంచి, స్కూల్ పాఠాలు విన‌డం వ‌ర‌కూ, ఆఫీసు మీటింగులు న‌డుపుకోవ‌డం వ‌ర‌కూ అన్నింటికీ ఒకటే ఆధారం అన్న‌ట్టుగా మారిపోయింది. నిజానికి ఒక్క ఫోన్ తో ఇన్ని ప‌నులు చేసుకోగ‌ల‌గ‌టం అనేది నిజంగా గొప్ప విష‌య‌మే. అయితే.. ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే.

రెండో వైపు దీనివ‌ల్ల జ‌రిగే న‌ష్టాలు ఊహాతీతం. ఎంతో మంది వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని ర‌ట్టు చేసుకుంటున్నారు. ఆన్ లైన్ మోసాలకు గుర‌వుతున్నారు. అశ్లీల సామ్రాజ్యపు సాలెగూడులో చిక్కుకుపోతున్నారు. విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నాణెంలో మొద‌టి వైపుగా వెళ్లిన వారు స‌క్సెస్ కు కేరాఫ్ అవుతుండ‌గా.. రెండో వైపు మ‌ళ్లిన‌వారు.. జీవితంలో చాలా కోల్పోతున్నారు.

ఈ నేప‌థ్యంలో అస‌లు జ‌నాలు రోజుకు ఎంత స‌మ‌యం ఫోన్లో గ‌డుపుతున్నార‌నే విష‌యం తెలుసుకునేందుకు ఇటీవ‌ల ఓ స‌ర్వే జ‌రిగింది. ఒక ఏడాది కాలంలో ఉప‌యోగించిన డేటా ఆధారంగా స‌ర్వే రిపోర్టును రూపొందించారు. దీని ప్ర‌కారం జ‌నాలు స్మార్ట్ ఫోన్ల‌ను ఎలా వాడుతున్నారనేది అంచ‌నా వేశారు. ప్ర‌ధానంగా.. 15 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న వారి నుంచి 69ఏళ్ల లోపు వారి వివ‌రాలను సేక‌రించి, వారు ఫోన్ వినియోగిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. దీని ప్ర‌కారం.. రోజుకు క‌నీసం 5 గంట‌ల 20 నిమిషాల వ‌ర‌కు ఆన్ లైన్లో గ‌డుపుతున్నార‌ట‌. ఇందులో దాదాపు 90 నిమిషాల వ‌ర‌కు వీడియోలు చూడ‌డానికి కేటాయిస్తున్నార‌ట‌. అదే స‌మ‌యంలో వాయిస్ కాల్స్ కోసం మాత్రం స‌గ‌టున‌ కేవ‌లం 10 శాతం స‌మయాన్ని మాత్ర‌మే వినియోగిస్తున్నార‌ట‌.

ఇక‌, అత్య‌ధికంగా అశ్లీల వీడియోలు చూడ‌డానికే ప్రాధాన్యం ఇస్తున్నార‌ట‌. 18 నుంచి 25 ఏళ్ల‌ మ‌ధ్య ఉన్న‌వారిలో దాదాపు 45 శాతం మంది ఈ వీడియోలు చూస్తున్నార‌ట‌. 26 నుంచి 35 సంవ‌త్స‌రాల వ‌య‌సువారిలో 40 శాతం అశ్లీల వీడియోల‌ను చూస్తున్నార‌ట‌. 36 నుంచి 44 ఏళ్ల‌ మ‌ధ్య ఉన్న‌వారు 7 శాతం, 45 నుంచి 55 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌ ఉన్న‌వారు 4 శాతం అశ్లీల సామ్రాజ్యంలో విహ‌రిస్తున్న‌ట్టు అంచ‌నా. స్మార్ట్ ఫోన్లు వాడేవారిలో సుమారు 89 శాతం మంది నిత్యం ఏదో ఒక స‌మ‌యంలో ఈ సెక్స్ వీడియోలు చూస్తున్నార‌ట‌.

ఈ విధంగా స్మార్ట్ ఫోన్ ఉన్న‌వారిలో మెజారిటీ జ‌నం విలువైన కాలాన్ని అన‌వ‌స‌రానికి ఖ‌ర్చు చేస్తుండ‌డంతోపాటు.. అశ్లీల వీడియోలు చూసేందుకు ఆరాట‌ప‌డుతున్న‌ట్టు తేలిసింది. అయితే.. దీనివ‌ల్ల మాన‌సికంగా కూడా చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని మాన‌సిక నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అశ్లీల వీడియోల‌కు అల‌వాటు ప‌డితే ఎన్నో విధాలుగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుందని చెబుతున్నారు. అందువ‌ల్ల ఫోన్ ను అవ‌స‌రం కోసం మాత్ర‌మే వినియోగించాల‌ని సూచిస్తున్నారు. అన‌వ‌స‌ర‌మైన వాటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల అటు స‌మ‌యం, డేటాఖ‌ర్చు కావ‌డంతోపాటు క‌ళ్ల స‌మ‌స్య‌లు, ఇత‌ర‌త్రా ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.