Begin typing your search above and press return to search.

నాసాలో భారతీయులు ఎంతమంది?

By:  Tupaki Desk   |   18 Jun 2019 11:49 AM GMT
నాసాలో భారతీయులు ఎంతమంది?
X
ఇప్పుడు భారతీయులు లేని కంపెనీ లేదు. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలైన గూగుల్- మైక్రోసాఫ్ట్ నడిపే సుందర్ పిచాయ్- సత్యనాదెళ్లలు మన భారతీయులే. నోకియా- అడోబ్ సంస్థలకు భారతీయులే సీఈవోలు. ఇక ఎన్నో దిగ్గజ సంస్థలకు బాసులు కూడా మనవారే.. ఇలా భారతీయుల ప్రతిభకు ఎన్నో కొలమానాలున్నాయి.

తాజాగా డాక్టర్ కాశ్ సిరినంద పేరిట వెలువడ్డ ట్వీట్ వైరల్ అయ్యింది. అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో (నాసా)లో 58శాతం మంది భారతీయులే ఉన్నారంటూ ఆయన చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంతరిక్ష యానంలో ఇప్పుడు నాసాను మించిన సంస్థ ప్రపంచంలోనే లేదు. అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలోని నాసాలో భారతీయులు 58శాతం మంది ఉన్నారన్న దానిపై తాజాగా నాసాకు చెందిన ‘డేటా అండ్ అనలిటిక్స్ యూనిట్’ వివరాలను బహిర్గతం చేసింది.

నాసాలో మొత్తం 17వేల మంది పనిచేస్తుండగా.. వారిలో 72శాతం మంది శ్వేత జాతీయులేనట.. ఇందులో తూర్పు యూరప్ కు చెందిన ఇంగ్లీష్ మెన్స్ ఎక్కువగా ఉన్నారట.. ఇక ఆఫ్రికన్ అమెరికన్లు 12శాతం.. ఏడు శాతం ఆసియన్ అమెరికన్లు, 8శాతం హిస్పానిక్ లేదా లాటినోలు, ఒకశాతం అమెరికన్ ఇండియన్లు ఉన్నారని తెలిపింది.

ఇలా ఇండియన్లు 1శాతం మాత్రమే అనడం సంచలనంగా మారింది. మొత్తంగా ఆసియన్లు 7శాతం కలుపుకుంటే 8శాతం మంది ఆసియన్లు ఉన్నట్టు లెక్క.

అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వడం నాసా ఉద్యోగ నియామకాల విధానం. చాలా కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నా ప్రఖ్యాత అంతరిక్ష సంస్థలో మాత్రం ఇండియన్ల వాటా 1శాతమే అని పేర్కొనడం సంచలనంగా మారింది.