Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ ఎన్ని నెలలు ఉంటుందంటే?

By:  Tupaki Desk   |   29 April 2021 10:38 AM GMT
సెకండ్ వేవ్ ఎన్ని నెలలు ఉంటుందంటే?
X
సెకండ్ వేవ్ కు కారణమైన కరోనా వైరస్ డేంజర్ గా ఉందని.. ఈ వైరస్ తీవ్రత తగ్గడానికి కనీసం 3 నెలలు పడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తే మే నెలాఖరు వరకు కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరి.. ఆ తర్వాత జూన్ లో తగ్గుముఖం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కరోనా వైరస్ వేగంగా మార్పులు చెందుతోందని.. ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించకపోతే మూడోవేవ్ వచ్చే ప్రమాదం లేకపోలేదని రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం వైరస్ ల వ్యాప్తిగా తక్కువగా ఉన్నా పంజాబ్, హరియానాల్లో యూకే రకం వైరస్, మహారాష్ట్రలో డబుల్ మ్యూటేషన్ వైరస్ విస్తృతంగా వ్యాపించిందని ఆయన తెలిపారు. వాటి వల్లే కేసులు ఉప్పెనలా వస్తున్నాయని చెప్పారు.

ఈ సారి యువత ఎక్కువగా అనారోగ్యం బారిన పడడానికి యువత నిర్లక్ష్యం కారణమని రాకేష్ మిశ్ర తెలిపారు. చాలా మంది ఆలస్యంగా ఆస్పత్రులకు రావడం కూడా కారణమని వివరించారు. ఇప్పటికే సగంమందికి కరోనా వచ్చిపోయిందని.. అయితే 70శాతం మందికి పైగా ప్రజల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని చెప్పారు.

కరోనాలో ఆరువేలకు పైగా ఉత్పరివర్తనాలు ఉన్నాయని.. అందుకే ఊహకు అందనివిధంగా ఈ వైరస్ మారుతోందని.. కొత్త వేరియంట్స్ తోనే ప్రమాదం అని రాకేష్ తెలిపారు. మూడో వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.