Begin typing your search above and press return to search.
చంద్రబాబు డిమాండ్లలో ఎన్ని సాధ్యం ?
By: Tupaki Desk | 26 Oct 2021 6:13 AM GMTజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయించటమే టార్గెట్ గా చంద్రబాబునాయుడు హస్తిన టూర్ పెట్టుకున్నారు. ఇదే ప్రధాన డిమాండ్ తో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. తన పార్టీ నేతలతో కలిసి వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫిర్యాదులు విన్న రాష్ట్రపతి అన్ని విషయాలను తెలుసుకుంటానన్నారు. రాష్ట్రంలో ఏమి జరుగుతోందో కనుక్కుంటానని చెప్పారు. ఇదంతా మామూలు వ్యవహారమే. రాష్ట్రపతిని ఎవరు కలిసి ఎవరిమీద ఫిర్యాదు చేసినా సదరు ఫిర్యాదులను పరిశీలిస్తాననే చెబుతారు.
అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రాష్ట్రపతి ముందు చంద్రబాబు నాలుగు డిమాండ్లను ఉంచారు. వీటిల్లో ఎన్ని నెరవేరుతాయన్నదే అసలైన పాయింట్. ఇంతకీ ఆ డిమాండ్లు ఏమిటంటే మొదటిది ఏపీలో ఆర్టికల్ 356 అమలు చేయాలని. అంటే జగన్ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని. ఇందుకు ఎలాంటి అవకాశం లేదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత పరిస్ధితులు లేవు. జరుగుతున్న గొడవ కేవలం రెండు పార్టీల మధ్య వివాదం మాత్రమే.
ఇక రెండో డిమాండ్ ఏమంటే తమ పార్టీ ఆఫీసులపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ చేయించాలని. దీనికి కూడా అవకాశం దాదాపు లేదనే అనుకోవాలి. టీడీపీ ఆఫీసులపై వైసీపీ నేతలు దాడులు ఎందుకు చేశారు ? టీడీపీ నేత పట్టాభి జగన్ను పట్టుకుని నోటికొచ్చినట్లు తిట్టిన కారణంగానే. అంటే టీడీపీనే వైసీపీ నేతలను రెచ్చగొట్టి తమ ఆఫీసులపై దాడులు జరిగేట్లు రెచ్చగొట్టిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంతోటిదానికి సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించటం అనుమానమే.
ఏపీలో గంజాయి, హెరాయిన్ పై చర్యలు తీసుకోవాలనేది మూడో డిమాండ్. గంజాయి సాగు, రవాణా తదితరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను జగన్ నియమించి చాలా కాలమే అయింది. ఈ టాస్క్ ఫోర్స్ రెగ్యులర్ గా దాడులు చేసి కేసులు పెడుతునే ఉంది. గడచిన రెండున్నరేళ్ళల్లో దాదాపు 2 లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక హెరాయిన్ సంగతంటారా ముందు దేశంలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమే.
అసలు గుజరాత్ లోని ముంద్రా పోర్టులోకి 3 వేల కిలోల హెరాయిన్ ఎలా వచ్చిందో ముందు కేంద్రమే సమాధానం చెప్పాలి. ముందు కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటే తర్వాత రాష్ట్రాల గురించి మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్ గా డీజీపీని రీకాల్ చేసి చేసిన తప్పులకు శిక్షించాలట. ఇది కూడా జరిగేందుకు అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. మరి చంద్రబాబు ఢిల్లీ టూరులో ఏమి సాధించారంటే ఆ విషయం చంద్రబాబే చెప్పాలి.