Begin typing your search above and press return to search.

దేశంలో ఏ యాప్ ఎంతమంది వాడుతున్నారంటే?

By:  Tupaki Desk   |   27 May 2021 6:42 AM GMT
దేశంలో ఏ యాప్ ఎంతమంది వాడుతున్నారంటే?
X
సోషల్ మీడియా .. సోషల్ మీడియా .. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా అందరికి ఓ వ్యసనంలా తయారైంది. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే ఉంటారు. పిల్లల , పెద్దలు , ముసలివారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా లో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన వాట్సాప్ ,పేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ , ట్విట్టర్ , యూట్యూబ్ వాడకం రోజురోజుకి భారీగా పెరిగిపోతోంది. ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉండటం తో ప్రతి ఒక్కరూ కూడా పక్కన ఏం జరుగుతుందో కూడా గమనించకుండా సోషల్ మీడియా లో పడి నవ్వుకుంటుంటారు. కొందరికి ఎంతలా వ్యసనం అయ్యింది అంటే .. ఉదయం లేచి నప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా అందరికి షేర్ చేసుకుంటుంటారు.

ఇదిలా ఉంటే .. మనదేశంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. 2021 ఫిబ్రవరి నాటికీ ఇండియా లో ఏ యాప్ ఎంతమంది వినియోగిస్తున్నారో కేంద్రం ప్రకటించింది. ఆ వివరాలని ఒకసారి చూస్తే .. వాట్సాప్ ను దేశంలో 53 కోట్ల మంది వాడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో యూట్యూబ్ నిలిచింది. యూట్యూబ్ ను దేశంలో 44. 8 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ఇక సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ ను 41 కోట్ల మంది వాడుతున్నారు. ఇక ఇన్ స్టాగ్రామ్ ను 21 కోట్ల మంది వాడుతుండగా .. ట్విట్టర్ ను 1.75 కోట్ల మంది వినియోగిస్తున్నారు. మొత్తంగా దేశంలో అత్యధికులు వినియోగించే యాప్ గా వాట్సాప్ మొదటి స్థానంలో నిలిచింది.