Begin typing your search above and press return to search.
ఒక దెబ్బకు ఎన్ని పిట్టలు రాలుతాయో ?
By: Tupaki Desk | 2 Feb 2022 2:30 AM GMTఇపుడిదే విషయమై చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ రెండు నియోజకవర్గాల్లో నుండి పోటీచేస్తున్నారు కాబట్టే. మొదట్లో ఒక నియోజకవర్గానికే చన్నీ పరిమితమవుతారని అనుకున్నారు. అయితే వ్యూహాత్మకంగా చివరినిముషంలో అధిష్టానం చన్నీని రెండు చోట్ల నుండి పోటీచేయిస్తోంది. అందుకనే చన్నీ పోటీవల్ల ఎన్ని పిట్టలు రాలుతాయో అనే చర్చ మొదలైంది.
చన్నీ పోటీవల్ల రెండు నియోజకవర్గాల్లోను ప్రత్యర్ధులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అలాగే సొంతపార్టీలోని అసంతృప్తులకు కూడా ఒక విధంగా చెక్ పెట్టినట్లయ్యింది. మొదటి నుండి చన్నీ గెలుస్తున్న చమ్ దౌర్ సాహెబ్ నియోజకవర్గం నుండి నాలుగోసారి పోటీలోకి దిగారు. ఇక్కడ చన్నీ గెలుపు నల్లేరుమీద నడకే అంటున్నారు. ఇక రెండోది మాల్వా ప్రాంతంలోని బదౌర్ నియోజకవర్గం నుండి కూడా పోటీలోకి దిగారు.
మాల్వా ప్రాంతంలోని 68 సీట్లలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీదే విజయమని సెంటిమెంటుంది. పైగా ఈ ప్రాంతంలో దళితుల ప్రాభవం చాలా ఎక్కువ. అందుకనే వ్యూహాత్మకంగా దళితుడైన చన్నీ బదౌర్ నుండి కూడా పోటీచేస్తున్నారు. తమ ప్రాంతంనుండి ముఖ్యమంత్రి అందులోను దళితుడు పోటీచేస్తే దళితుల ఓట్లంతా కాంగ్రెస్ కే పడతాయనేది కాంగ్రెస్ అధిష్టానం భావన. చమ్ దౌర్ సాహెబ్ నియోజకవర్గంలో గెలుపు ఖాయమేనట. బదౌర్ లో కూడా చన్నీ గెలిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమనే అంటున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే చన్నీ రెండుచోట్ల పోటీచేస్తున్న కారణంగా సీఎం అభ్యర్ధి ఎవరనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది అధిష్టానం. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయాన్ని ప్రకటించాలంటే పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. చన్నీని రెండుచోట్ల పోటీచేయించటం ద్వారా సీఎం అభ్యర్ధి విషయంలో సిద్ధూ నోరుమూయించేసింది. మొత్తానికి చివరినిముషంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. చివరికి ఏమవుతుందో చూడాలి.