Begin typing your search above and press return to search.

బీజేపీ గవర్నమెంట్ ఇన్ని రైల్వే స్టేషన్లను ప్రైవేటైజేషన్ చేసిందా? !

By:  Tupaki Desk   |   10 March 2021 11:30 AM GMT
బీజేపీ గవర్నమెంట్ ఇన్ని రైల్వే స్టేషన్లను ప్రైవేటైజేషన్ చేసిందా? !
X
కేంద్రప్రభుత్వం దూకుడు చూస్తుంటే రైల్వస్టేషన్లను కూడా ప్రైవేటీకరణ చేయటం ఖాయమని అర్ధమైపోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల రైల్వేస్టేషన్లలో ముందుగా 90 స్టేషన్లను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా డిసైడ్ అయినట్లు సమాచారం. ఏ పద్దతిలో రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరించాలనే విషయమై స్పష్టమైన ప్లాన్ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే కేంద్రప్రభుత్వం భారతీయ రైల్వేని అడిగింది.

రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణ అంశాలను ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తోంది. రైల్వేస్టేషన్లను ప్రైవేటుపరం చేస్తే అనుసరించాల్సిన భద్రతా పరమైన వ్యవహారాలపై స్పష్టమైన రిపోర్టు ఇవ్వాలంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను రైల్వేబోర్డు ఆదేశించింది. ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటి ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) చూసుకుంటోంది. అదే తరహాలో రైల్వే స్టేషన్ల భద్రతను కూడా సీఐఎస్ఎఫ్ కు అప్పగించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సూచించిందట.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రైల్వేస్టేషన్లలో భద్రత, నిర్వహణ మాత్రమే ప్రైవేటు పరం అవ్వబోతోంది. రైల్వేస్టేషన్ల ఆస్తులన్నింటినీ రైల్వే మంత్రిత్వశాక ఆధీనంలోనే ఉంటాయి. నిజానికి రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదు. 2019 నుండే ఇలాంటి ప్రతిపాదనలు పరిశీలినలో ఉన్నాయి.

తిరుపతి, నెల్లూరు, గ్వాలియర్, నాగ్ పూర్, అమృతసర్, సబర్మతి, పుదుచ్చేరి, డెహ్రడూన్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఇప్పటికే రిక్వెస్టు ఫర్ క్వాలిఫికేషన్ ప్రాసెస్ కు బిడ్డింగ్ పిలిచారు. ఆనంద్ విహార్, బిజ్వాసన్, ఛండీగడ్ రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరించాలని డిసైడ్ అయిపోయింది. కాబట్టి పైన చెప్పిన 90 స్టేషన్లు కూడా తొందరలోనే ప్రైవేటకీరణ జరగటం ఖాయమని తేలిపోయింది.