Begin typing your search above and press return to search.
తెలంగాణలో సూపర్ స్పైడర్లు ఎందరో లెక్కేశారా?
By: Tupaki Desk | 24 May 2021 12:30 AM GMTకరోనా కేసులు అంతకంతకు పెరిగిపోవటానికి కారణం వైరస్ వ్యాప్తి అని చెప్పేయొచ్చు. కానీ.. ఈ వైరస్ ను వాహకంగా మోసుకెళ్లే సూపర్ స్పైడర్ల కారణంగా.. పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదువుతున్నాయి. ఈ సూపర్ స్పైడర్లలో డ్రైవర్లు.. వీధి వ్యాపారులు.. గ్యాస్ డెలివరీ బాయ్.. బ్యాంకు ఉద్యోగులు.. పెట్రోల్ బంకుల్లో పని చేసే వారు.. ఇలా ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండేవారు.. నిత్యం చాలామందిని కలిసే వారు సూపర్ స్పైడర్లకు అవకాశం ఉంది.
చాలా దేశాల్లో ఇలాంటి సూపర్ స్పైడర్లను గుర్తించి.. వ్యాక్సినేషన్ లో మొదట వారికి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు.. వారందరికి టీకాలు ఇచ్చారు. అంటే.. వైరస్ ను మోసుకెళ్లే వారితోనే వైరస్ ను నిరోధించేలా చేస్తే.. వ్యాప్తికి అవకాశం ఉండదు కదా. అయితే.. ఈ లాజిక్ ను ఉపయోగించి మనదేశంలో ఇప్పటికి వ్యాక్సినేషన్ వేయలేదు. ఇలాంటి వేళ.. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ దిశగా కసరత్తు షురూ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో సూపర్ స్పైడర్లు ఎంతమంది ఉన్నారు? అన్న లెక్కలు వేయటం షురూ చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఆ కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారు దాదాపు పాతిక లక్ష ల మంది వరకు ఉంటారని అంచనా వేసింది. వీరిలో 45 ఏళ్లకు పైబడిన వారు.. 18ఏళ్లకు పైబడిన వారు రెండు వర్గాలుగా తేల్చి.. వారికి వ్యాక్సినేషన్ వేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
టీకా వేసే విషయంలో సూపర్ స్పైడర్లను ప్రత్యేకంగా గుర్తించి.. వారికి స్పెషల్ డ్రైవ్ ద్వారా వ్యాక్సిన్ వేస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించినట్లుఅవుతుందని భావిస్తున్నారు. అయితే.. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో.. సూపర్ స్పైడర్లకు ఏ రీతిలో వ్యాక్సిన్ వేయాలి? వారి రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దేశంలో మరే రాష్ట్రంలో ఈ తరహాలో టీకా వేయకపోవటంతో.. ఏ రీతిలోచేస్తే త్వరగా పూర్తి అవుతుందన్న విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెబుతున్నారు.