Begin typing your search above and press return to search.
ఏపీలో ఇన్ని టాక్స్లు ఉన్నాయా... ?
By: Tupaki Desk | 20 March 2022 2:30 AM GMTఏపీలో టాక్సుల గురించి ఒక పెద్ద చర్చే సాగుతోంది. చెత్త పన్ను అయితే సర్కార్ వారికి విమర్శల మీద విమర్శలు తెచ్చిపెడుతోంది. చెత్త పన్ను అన్నది ప్రజలకు భారంగా మారుతోంది. అయినా ప్రభుత్వం దాన్ని అమలు చేస్తోంది. సంక్షేమం పేరిట చెస్తున్న మంచి అంతా చెత్త పన్నుతో టోటల్ గా పక్కకు పోతోంది అన్న మాట కూడా ఉంది.
ఇదిలా ఉంటే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల పన్నులతో పాటు జె టాక్స్ ని కూడా అమలు చేస్తున్నారు అని టీడీపీ విమర్శిస్తోంది. దానికి షార్ట్ కట్ లో ముద్దుగా జె టక్స్ అని పేరు కూడా పెట్టారు. దాని మీద టీడీపీ నేతలు గట్టిగా మాట్లాడుతారు కూడా.
ఇపుడు జె టాక్స్ తో పాటు వీజే టాక్స్ కూడా ఏపీలో అమలవుతోందిట. ఆ మాట అన్నది టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న. అయితే ఈ వీజే టాక్స్ మాత్రం కేవలం ఉత్తరాంధ్రా వాసులను పీడించడానికే అంటున్నారు ఆయన. ఇంతకీ వీజే టాక్స్ కధా కమామీషూ ఏంటి అంటే విజయసాయిరెడ్డి టాక్స్ ట.
దాన్ని షార్ట్ కట్ చేసి వీజే టాక్స్ అని బుద్ధా వెంకన్న సెటైర్లు వేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ ఇంచార్జి. బుద్ధా వెంకన్న టీడీపీకి సంబంధించి ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జి. దాంతో ఈ ఇద్దరు నేతలు ట్విట్టర్ వేదికగా ప్రతీ రోజూ దాదాపుగా ఢీ కొడుతూనే ఉంటారు.
ఇక విశాఖలో తరచూ మీడియా సమావేశాలు పెడుతూ బుద్ధా వెంకన్న ఈ మధ్య హడావుడి చెసతున్నారు. తాజాగా ఆయన విశాఖ టూర్లో విజయసాయిరెడ్డిని గట్టిగానే టార్గెట్ చేశారు. విశాఖకు తుఫాన్ల వల్ల వచ్చే నష్టం కన్నా వీజే టాక్స్ వల్ల వచ్చేదే ఎక్కువ అని ఆయన తేల్చేశారు.
విశాఖలో పెద్ద ఎత్తున భూ దందా జరుగుతోందని, జగన్ ఉత్తరాంధ్రా జిల్లాల సమస్యల మీద ప్రజా దర్బార్ పెడితే ఆయన విస్తుబోయే నిజాలు జనాలు చెబుతారని బుద్ధా వెంకన్న అంటున్నారు. విశాఖ నుంచి ఉత్తరాంధ్రా జిల్లాల దాకా అంతటా వైసీపీ నేతల భూ కబ్జా భాగోతాలే ఉన్నాయని అంటున్నారు
తాము అధికారంలోకి వచ్చాక అవన్నీ బయటపెట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరిస్తున్నాఉ. అంతే కాదు, ఈసారి ఉత్తరాంధ్రా జిల్లాల్లో మొత్తానికి మొత్తం అంటే 34 సీట్లూ కూడా టీడీపీ పరం అవుతాయని, ఇది రాసిపెట్టుకోండని కూడా బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు మొత్తానికి ఉత్తరాంధ్రాలో వీజే టాక్స్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి. మరి దీని మీద ఎంపీ విజయసాయిరెడ్డి వర్గం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.