Begin typing your search above and press return to search.
రీపోలింగ్ ఎన్నిసార్లు అయినా జరిపించొచ్చా?
By: Tupaki Desk | 17 May 2019 5:48 AM GMTకారణం ఏదైనా కావొచ్చు. అందులో నిజానిజాల్ని పక్కన పెడదాం. లాజిక్ గా ఆలోచిద్దాం. ఒక రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ పూర్తి అయ్యాక.. ఏదైనా అనుకోనివి జరిగినప్పుడు.. ప్రజలు తమ ఓటుహక్కును సరిగా వినియోగించలేకపోయారన్న భావన కలిగినప్పుడు రీపోలింగ్ ఆదేశించటం మనం చూస్తున్నదే. అయితే.. పోలింగ్ పూర్తి అయ్యాక రీపోలింగ్ కార్యక్రమం జరిగిపోయిన సుమారు మూడు వారాల తర్వాత మళ్లీ రీపోలింగ్ కోసం డిమాండ్ చేయటం.. ఆ వెంటనే ఓకే చెబుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ కు ఓకే చెబుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమవుతోంది. ఈ తరహా నిర్ణయం ఎలా తీసుకుంటారన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. పోలింగ్ లో హింస చెలరేగినా? ఓటర్లు ఓట్లు వేసే అవకాశం లేదన్న భావన కలిగినప్పుడు రీపోలింగ్ నిర్ణయం తీసుకోవటాన్ని ఎవరూ ఏమీ అనరు.
అందుకు భిన్నంగా చంద్రగిరి ఉదంతంలో ఈసీ తీసుకున్న నిర్ణయంపై పలు సందేహాలు వస్తున్నాయి. ఈసీ తాజాగా రీపోలింగ్ కు ఆదేశించిన ఐదు పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరిగా జరగలేదన్న విషయాన్ని ఏ మీడియా ప్రస్తావించింది లేదు. చివరకు కలెక్టర్ కానీ.. ఎన్నికల అధికారులు కానీ పేర్కొన్నది లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలింగ్ ముగిసిన వెంటనే.. రాష్ట్ర వ్యాప్తంగా తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి వాటిల్లో రీపోలింగ్ కు అర్హమైన వాటిని గుర్తించి రీపోలింగ్ ను నిర్వహించటం తెలిసిందే.
ఒక రాష్ట్రంలో ఎన్నికల జరిగిన తర్వాత రీపోలింగ్ నిర్వహించటం.. ఆ తర్వాత మరోసారి రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేయటం ఉంటుందా? అన్నది ప్రశ్న. రీపోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక.. మళ్లీ రీపోలింగ్ కు అనుమతి ఇవ్వటం ఏమిటి? అన్నది మరో సందేహం. ఈ లెక్కన రేపొద్దున ఎవరైనా రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్ పెట్టుకుంటే.. ఈసీ అనుమతిస్తుందా? అన్నది మరో క్వశ్చన్. ఇలాంటివెన్నో సందేహాలతో పాటు.. రీపోలింగ్ అయ్యాక మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలన్న నిర్ణయంపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ చర్చల్లో ఒక మాట పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక సినిమాలో చెల్లికి పెళ్లి కావాలి మళ్లీ మళ్లీ అన్న కవిత ఏ రీతిలో ఉందో.. రీపోలింగ్ అయ్యాక మళ్లీ రీపోలింగ్ అలానే ఉందన్న విమర్శ వినిపిస్తోంది.