Begin typing your search above and press return to search.
చంద్రబాబుతో ఎంతమంది కలుస్తారు ?
By: Tupaki Desk | 23 Oct 2021 9:30 AM GMTజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరినీ కలుపుకునేందుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. అందుకనే 36 గంటల దీక్షను విరమించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలన్నీ తమతో కలిసి రావాలంటూ పిలుపిచ్చారు. ముందు అందరూ కలిసి పోరాటాలు చేయాలట తర్వాత ఎన్నికల్లో ఎవరి సిద్ధాంతాలతో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళవచ్చట. ప్రజా సంఘాలు, కులసంఘాలు, కూలీలు, రైతులు తమతో కలసి రావాలంటు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు విజ్ఞప్తి సరే టీడీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి అనే విషయం ఆసక్తిగా మారింది.
ఎన్నికల్లో పొత్తుల విషయానికి వస్తే చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ అంటు రాష్ట్రం ఏమీ మిగల్లేదు. బీజేపీ+జనసేనతో పొత్తు అయిపోయింది. తర్వాత బీజేపీ వైసీపీకి కాస్త దగ్గరై టీడీపిక దూరమైంది. జనసేన కూడా క్యాడర్ కోసం టీడీపీతో తెగతెంపులు చేసుకుంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి తల బొప్పి కట్టిన తర్వాత మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే కమలం పార్టీ నుండి ఎలాంటి సహకారం కనబడటం లేదు. అందుకనే ఇపుడు జనసేనతో కలిసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక వామపక్షాల సంగతిని చూస్తే చాలాకాలంగా సీపీఎం దూరంగా ఉంటోంది. ఏ విషయంలోనూ సీపీఎం చంద్రబాబుతో కలవడం లేదు.
అయితే సీపీఐ మాత్రం అనధికారికంగా చంద్రబాబుతోనే ఉంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పార్టీగా సీపీఐకి టీడీపీకి ఎలాంటి పొత్తులేదు. అయితే సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాత్రం చంద్రబాబుతోనే సానుకూలంగా ఉన్నారు. ఈ విషయంలో పార్టీలో రామకృష్ణను ఎంతమంది నిలదీస్తున్నా ఆయనైతే ఎవరినీ పట్టించుకోవటంలేదు. ఇక మిత్రపక్షాలైన బీజేపీ+జనసేనలో కమలనాథులు చంద్రబాబుకు దూరంగానే ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా చంద్రబాబుతో ఏ రకంగాను కలిసేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ప్రకటనల్లో చంద్రబాబునే ఫాలో అవుతున్నారు. చంద్రబాబు ఏమంటే అదే మాటలను పవన్ కూడా చిలకపలుకుల్లాగ రిపీట్ చేస్తున్నారు.
ఇక ఫైనల్ గా మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు లేకపోయినా తెలంగాణలో మాత్రం పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇద్దరు కలిసి బోర్లాపడిన తర్వాత మళ్ళీ కలవలేదు. కాబట్టి ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో క్లారిటీ లేదు. పార్టీల సంగతి ఇలాగుంటే పార్టీలకు అనుబంధంగా ఉండే సంస్థలు కానీ ప్రజాసంఘాల్లో ఏవి కూడా చంద్రబాబుతో పొత్తుకు సిద్ధంగా లేవు. ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం, విడిపోవటం, మళ్ళీ కలవడం, మళ్ళీ దూరంగా జరగడం అన్నది అన్ని పార్టీలకు చంద్రబాబుతో బాగా అనుభవమే.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసే పోరాటంలో కలిసొచ్చే పార్టీలు ఏవి అనే విషయంపై పెద్ద చర్చే మొదలైంది. వాస్తవంగా చూస్తే ప్రతిపక్షాల్లో ఏది కూడా చంద్రబాబుతో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేనట్లు అర్ధమవుతోంది. తనకు సమస్య వచ్చినపుడు అందరు తన చుట్టూ వచ్చి నిలబడాలి అనేది చంద్రబాబు మనస్తత్వం. నిజానికి అధికార వైసీపీ వల్ల ప్రతిపక్షాల్లో ఏ పార్టీకి కూడా ఎలాంటి సమస్యా లేదు. సమస్య వచ్చిందల్లా ఒక్క టీడీపీకి మాత్రమే. టీడీపీకి కూడా ఎందుకు సమస్య వచ్చిందంటే 24 గంటలూ జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లేస్తున్నది కాబట్టే. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మళ్ళీ సీఎం అవ్వాలంటే షెడ్యూల్ ఎన్నికలు 2024 వరకు ఆగాల్సిందే . మరి తాజా నేపథ్యంలో చంద్రబాబు పిలుపుకు ప్రతిపక్షాల్లో ఎన్ని పార్టీలు సానుకూలంగా స్పందిస్తాయో చూడాల్సిందే.