Begin typing your search above and press return to search.
అనుచరులతోనే ఈటలకు పొగపెడుతున్న టీఆర్ఎస్
By: Tupaki Desk | 7 Jun 2021 12:30 AM GMTటీఆర్ఎస్ పార్టీతో సుదీర్ఘ రాజకీయ అనుబంధాన్ని తెంచుకుంటూ సీనియర్ నేత ఈటల రాజేందర్ గు్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈటలను, ఆయన అనుచరులను టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి ఆసక్తికర ఎపిసోడ్ లో ఈటల రాజేందర్ మనుషులు అనే పేరున్న నాయకులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం చర్చకు తెరలేపుతోంది. ఈటల రాజేందర్ అనుచరుడనే పేరున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తాజాగా ఈటలపై సంచలన విమర్శలు చేశారు.
టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్న సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత, సంతోష్ రావులపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పుట్ట మధు స్పందించారు. కవిత ముఖ్యమంత్రి కూతురుగా కాకుండా ప్రజల పక్షాన పని చేస్తున్న నేతగా కృషి చేశారన్నారు. మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అంతమొందించడానికి కవిత చేసిన కృషి మరువలేమన్నారు. సమస్యలపై స్పందించే విధానాన్ని చూసి టిబిజికెఎస్ నేతలు కవితను గౌరవ అధ్యక్షురాలు ఎన్నుకున్నారు. కవితకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పుట్ట మధు తెలిపారు. ఆమె నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారని పేర్కొంటూ ఆమె సారథ్యంలోనే పనిచేస్తామని పుట్ట మధు తెలిపారు.
ఎంపీ సంతోష్ కుమార్ పార్టీ అభివృద్ధికి, తెలంగాణ ఆవిర్భావ కోసం ఎంతో కృషి చేశారని పుట్ట మధు తెలిపారు. ఈటల రాజేందర్ తనపై వచ్చిన ఆరోపణలపై జవాబు చెప్పాలి, కానీ టీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల కోసం పని చేస్తుంటే పదవులు అవే వస్తాయనే విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తించాలని పుట్ట మధు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలపై ఈటెల రాజేందర్ చేసిన విమర్శలు తిరిగి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.