Begin typing your search above and press return to search.
దిశ హత్య ఆడవారిలో ఎంత మార్పు తీసుకువచ్చిందంటే ?
By: Tupaki Desk | 14 Dec 2019 5:52 AM GMTహైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం గురించి అందరికి తెలిసిందే. పశువులకు బాగాలేకపోతే ట్రీట్ మెంట్ చేయడానికి వెళ్లి ఇంటికి వస్తున్న దిశ ని నలుగురు మానవ మృగాళ్లు పక్కా పథకంతో నమ్మించి మోసం చేసి అఘాయిత్యం చేసి , అతి కిరాతకంగా చంపేశారు. ఆ తరువాత శవాన్ని కూడా వదిలిపెట్టకుండా పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటన తో దేశం మొత్తం మరోసారి ఉల్లిక్కి పడింది. ఈ అఘాయిత్యం తో హైదరాబాద్ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది.
ఇక ఇదే సమయంలో...మహిళలు, అమ్మాయిలు ఆత్మరక్షణలో భాగంగా మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లేందుకు హైదరాబాద్ మెట్రో అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి మెట్రో రైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారు అంటే కచ్చితంగా మాత్రం చెప్పలేము. కానీ , ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసేవారి దగ్గర పెప్పర్ స్ప్రే కనుక ఉంటే ..ఆ కామాంధుల కళ్ళల్లో కొడితే… వాళ్లు కోలుకునేలోపు తప్పించుకునే అవకాశం ఉంటుంది. దిశ లాంటి ఘటనలు జరిగాయని తెలిసినప్పుడల్లా ‘పెప్పర్ స్ప్రే ' ఒకటి బ్యాగులో పెట్టుకుంటే ఆపదలో పనికొస్తుంది కదా?’ అన్న సలహాలెన్నో అమ్మాయిలకు అందరూ ఇస్తుంటారు.
దిశ ఉదంతం తరువాత అమ్మాయిలు , ఆడవారు ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే తీసుకోని వెళ్ళాలి అంటే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెప్పర్ స్ప్రేలు కొంటున్న వాళ్ల సంఖ్యా బాగానే పెరిగింది. అందుకు నిదర్శనం అమెజాన్ సేల్స్. ఈ వారం రోజుల్లోనే అమెజాన్‌లో పెప్పర్ స్ప్రే సేల్స్ 700 శాతం పెరిగిందంటే… అమ్మాయిలు దీని అవసరాన్ని ఎంత ఉందనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ‘సెక్యూరిటీ అండ్ సేఫ్టీ’ సెక్షన్ ‘పెప్పర్ స్ప్రే’ బెస్ట్ సెల్లర్. ఒక్కసారిగా దీనికి డిమాండ్ పెరగడంతో ‘కోబ్రా’ లాంటి టాప్ పెప్పర్ స్ప్రే బ్రాండ్ ‘అవుటాఫ్ స్టాక్’ బోర్డు పెట్టాల్సి వచ్చింది.