Begin typing your search above and press return to search.

ఇన్ స్టా పోస్టులతో కోహ్లీ ఎంత సంపాదిస్తున్నాడంటే?

By:  Tupaki Desk   |   23 July 2022 2:30 AM GMT
ఇన్ స్టా పోస్టులతో కోహ్లీ ఎంత సంపాదిస్తున్నాడంటే?
X
ఆటలోనే కాదు.. ఆర్జనలో కూడా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా చాటుతున్నాడు. టీమిండియా కెప్టెన్ గా ఉండగా వంద కోట్ల వరకూ ఆయన సంపాదన ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కెప్టెన్సీ కోల్పోయినా విరాట్ సంపాదన ఏమీ తగ్గలేదు. సోషల్ మీడియా ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా అత్యధికంగా ఆర్జించిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు.

మైదానంలో ఫాం కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ బయట మాత్రం బాగానే సంపాదిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీకి ఏకంగా 100 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ స్థాయిలో ఫాలోవర్లు ఎవరూ లేరు. దీంతో కోహ్లీకి రికార్డు స్తాయిలో డబ్బులు వస్తున్నాయి.

కరోనా లాక్ డౌన్ సమయంలో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఇన్ స్టా గ్రామ్ ద్వారా సంపాదనలో ఏకంగా 6వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ లాక్ డౌన్ కాలంలో స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా ఏకంగా రూ.3 కోట్ల 63 లక్షలు సంపాదించారు. అంటే ఒక్క పోస్టు విలువ రూ.1కోటీ 21 లక్షలు అన్నమాట..

ఈ ఇన్ స్టాగ్రామ్ సంపాదనలో పోర్చుగల్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రోనాల్డో రూ.17కోట్ల 24లక్షలతో టాప్ లో కొనసాగుతున్నాడు. అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ (రూ.11.50 కోట్లు), నెయ్ మర్ (రూ.10.53 కోట్లు) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.ఇక ఫుట్ బాల్ లో తొలి బిలియనీర్ గా క్రిస్టియానో రొనాల్డో అవతరించాడు. టీమ్ స్పోర్ట్స్ లో ఈ ఘనత సాధించిన తొలి ఫుట్ బాలర్ గా రికార్డులెక్కాడు. గత ఏడాదిలో రొనాల్డో సంపాదన రూ.793 కోట్లు. బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మూడో ఆటగాడు ఇతడు...

ఇన్ స్టాగ్రామ్ లో పలు బ్రాండ్లకు సంబంధించి కోహ్లీ ఒక్క పోస్టు చేస్తే రూ.8.69 కోట్లు ఆర్జిస్తున్నట్టు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో 20 పోస్టులు చేసి శ్రీలంక దరిద్రాన్ని తరిమేయగలడని సెటైర్లు వేస్తున్నారు. దేశంలోని పేదరికాన్ని కూడా కోహ్లీ నిర్మూలించగలడని కొందరు అభిప్రాయపడుతున్నారు.

విరాట్ కోహ్లీ ఫాం కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీ ముందు కోహ్లీ ఫామ్ అందుకోవడానికి ముందస్తుగా జింబాబ్వే పర్యటన ుంటుందని భావిస్తున్నారు.