Begin typing your search above and press return to search.
ఫ్రెష్ లిస్ట్ - స్విస్ బ్యాంక్ లో మనోళ్ల డబ్బు ఎంతంటే...
By: Tupaki Desk | 11 Oct 2021 4:30 PM GMTస్విస్ బ్యాంక్. అనగానే మనోళ్లు నల్లధనానికి.. కేరాఫ్ అనే ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశ నిబంధనలు లైట్‌గా ఉండడం కావొచ్చు.. మరే రీజనైనా కావొచ్చు.. భారతీయుల ధనం కట్టలకొద్దీ స్విస్ బ్యాంకుల్లో మూలుగుతోందన్నది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఈ మాట ప్రకారమే.. 2014లో అధికారంలోకి వచ్చే ముందు ప్రధాని నరేంద్ర మోడీ.. స్విస్ లో ఎంత ఉందో లెక్కలు కక్కిస్తాం.. నల్ల ధనం రప్పిస్తాం.. అంటూ.. ప్రతిజ్ఞలు చేశారు. అయితే.. మొత్తానికి ధనం రాకపోయినా.. ఆదేశంతో జరుపుతున్న సంప్రదింపుల కారణంగా ఎవరెవరికి అక్కడ అకౌంట్లు ఉన్నాయో.. జాబితా మాత్రం వస్తోంది. తాజాగా ఈ పరంపరలోనే స్విట్జర్లాండ్ నుంచి మన దేశానికి మూడో జాబితా అందింది.
స్విట్జర్లాండ్‌లో భారతీయుల అకౌంట్లకు సంబంధించిన మూడో సెట్ ఇండియాకు అందింది. స్విట్జర్లాండ్‌లో అకౌంట్లున్న భారతీయుల వివరాలను ఆ దేశం భారత్‌కు పంపడం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఇరుదేశాల మధ్య ఉన్న 'ఆటోమాటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్‌పర్మేషన్' ఒప్పందం కింద ఈ వివరాలను స్విస్ అందజేసింది. 96 దేశాలకు సుమారు 33 లక్షల ఫైనాన్షియల్ అకౌంట్ల వివరాలను స్విట్జర్లాండ్ షేర్ చేసింది. ఈ ఏడాది మరో పది దేశాలతో సమాచారం పంచుకున్నట్టు ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. యాంటిగ్వా అండ్ బార్బుడా, అజర్‌బైజాన్, డొమినికా, ఘన, లెబనాన్, మకవు, పాకిస్థాన్, ఖతార్ దేశాలు ఇందులో ఉన్నాయి.
వరుసగా మూడో సంవత్సరం కూడా ఇండియా సమాచారం అందుకుందని, స్విస్ ఆర్థిక సంస్థల్లో పలువురు వ్యక్తులు, కంపెనీలకు చెందిన సమాచారం ఎక్స్జేంజ్ చేసినట్టు ఎఫ్‌టీఏ తెలిపింది. గత నెలలో ఈ ఎక్స్జేంజ్ జరిగిందని, మరో విడత సమాచారం 2022 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్ షేర్ చేస్తుందని పేర్కొంది. ఆటోమేటక్ ఎక్స్జేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) కింద స్విట్జర్లాండ్ నుంచి 2019 సెప్టెంబర్‌లో భారత్ తొలిసారి సమాచారం అందుకుంది. అయితే.. అప్పట్లోనూ.. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన.. మూడో జాబితాలోనూ.. కూడా స్విస్ బ్యాంకు ఎక్కడా.. ధనవంతుల పేర్లు మాత్రం వెల్లడించలేదు. అదేమంటే.. మా నిబంధన ఇంతే అంటూ.. పేర్ల స్థానంలో కొన్ని కోడ్‌లను మాత్రమే ఇచ్చిందని ఆర్థిక వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి ఈ లెక్కన ఈజాబితాలు చూసుకుని ఏం చేయాలో.. మోడీగారే ఆలోచించుకోవాలని అంటున్నారు పరిశీలకులు.