Begin typing your search above and press return to search.
భార్యకు బిల్ గేట్స్ ఇచ్చే ఆస్తి ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 4 May 2021 4:30 PM GMTమైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన భార్య మెలిందా విడాకులు తీసుకుంటున్నారనేది పాత విషయం. భార్యకు భరణంగా బిల్ గేట్స్ ఎంత ఆస్తి ఇవ్వబోతున్నాడు అన్నది కొత్త టాపిక్. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ ఆస్తుల వివరాలను పరిశీలిస్తే.. ఈ ఫిబ్రవరి నాటికి బిల్ గేట్స్ మొత్తం ఆస్తి సుమారు 138 బిలియన్ డాలర్లు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్థాపించిన బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్ విలువ దాదాపు 52 బిలియన్ డాలర్లు. ఇంకా.. ఇల్లు, ఇతర ఆస్తుల విలు 150మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు.
అయితే.. అమెరికా చట్టాల ప్రకారం.. పెళ్లయ్యాక ఒనగూరిన సంపాదనలో భార్యాభర్తలకు ఇద్దరికీ సమాన వాటా ఉంటుంది. వీళ్లిద్దరూ విడాకుల విషయాన్ని ప్రకటించడానికి ముందే.. ఆస్తి పంపకాల గురించి కూడా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ మేరకు కోర్టుకు సైతం ఈ వివరాలను అందజేశారట. అందుతున్న సమాచారం ప్రకారం ఉన్న ఆస్తులను ఇద్దరూ సమంగా పంచుకున్నట్టు తెలుస్తోంది.
కాగా.. వీళ్ల పంపకానికి ముందే పిల్లలకు కొంత వాటా తీసిపెట్టారట. అయితే.. వాళ్లకు ఉన్న ఆస్తితో పోలిస్తే అది చాలా చిన్న అమౌంట్ గా చెబుతున్నారు. ముగ్గురు పిల్లలకు తలా 10 మిలియన్ డార్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
ఇక, బిల్-మిలిందాగేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఛారిటీ సంస్థగా ఉంది. తమ విడాకులు ఈ సంస్థ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులూ రావని, తాము విడిపోయినా.. ఈ ఫౌండేషన్ కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. మొత్తంగా చూస్తే.. తనవాటాకు వచ్చే ఆస్తి ద్వారా ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల జాబితాలో మెలిందా చేరడం ఖాయం అంటున్నారు. అదే సమయంలో.. అత్యధిక సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్ చాలా కిందకు పడిపోతారని చెబుతున్నారు.