Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌లు ఇంత టెన్ష‌న్ ప‌డ్డారా?

By:  Tupaki Desk   |   11 April 2022 10:30 AM GMT
వైసీపీ నేత‌లు ఇంత టెన్ష‌న్ ప‌డ్డారా?
X
వైసీపీ స‌ర్కారులో రెండో ద‌ఫా మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం పూర్త‌యింది. మొత్తం 25 మంది కొత్త మంత్రు లతో జ‌గ‌న్ 2.0 కేబినెట్ రంగంలోకి దిగింది. ఆది నుంచి ఆశిస్తున్న‌వారికి ఈ ద‌ఫా నిరాశే ఎదురైంది. ఊహించని నాయ‌కులు.. ఉష శ్రీ చ‌ర‌ణ్‌, మేరుగ నాగార్జున‌, కొట్టు స‌త్య‌నారాయ‌ణ వంటి ప‌లువుకు మంత్రి ప‌ద‌వులు త‌మ ఖాతాల్లో వేసుకున్నారు. అయితే.. మంత్ర వ‌ర్గ కూర్పు తెర‌మీదికి వ‌చ్చిన ప్ప‌టి నుంచి ఈ జాబితాలో చోటు ద‌క్కుతుంద‌ని.. ద‌క్కించుకోవాల‌ని.. భావించిన నాయ‌కులు చాలా టెన్ష‌న్‌కు గుర‌య్యార‌నేది వాస్త‌వం. ఎందుకంటే.. నిముషానికో విధంగా ఈ కూర్పు మారిపోయింది.

ఆఖ‌రుకు జాబితా రెడీ అయితే.. గ‌వ‌ర్న‌ర్ ఆఫీస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయిన త‌ర్వాత‌.. కూడా మారిపోయింది. చి ట్ట చివ‌రి నిముషంలో.. తిప్పే స్వామి స్థానంలో ఆదిమూల‌పు సురేష్ పేరు మార్చారు. ఇలా.. జాబితా క‌స‌ర త్తు.. మొత్తం 48 గంట‌ల పాటు.. నేత‌ల‌ను ఉక్కిరి బిక్కిరికి గురి చేసింది.

ముఖ్యంగా పార్టీలో కీల‌కంగా ఉన్న సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కూడా తీవ్ర టెన్స‌న్ ఎదుర్కొన్నారు. త‌మ పేరు ఉంద‌ని కొంద‌రు.. లేద‌ని కొంద‌రు.. ఉంటుంద‌ని ఆశించిన వారు కొంద‌రు.. ఇలా .. అనేక విధాల న‌రాలు తెగే ఉత్కంఠ‌ను ఎదుర్కొన్నారు. ఇలాంటి వారిలో ప‌ల్నాడు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఒక‌రు.

ఈయ‌న కాపు సామాజిక‌వ ర్గానికి చెందిన నాయ‌కుడు. వాస్త‌వానికి ఈ కోటాలో సీటు అంటే.. ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన నాయ‌కులే ఇస్తార‌నే ప్ర‌చారం జరిగింది. వాస్త‌వానికి రాజకీయ స‌మీక‌ర‌ణ‌లు చూసుకున్నా.. ఆ జిల్లాల్లోనే కాపు వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది క‌నుక‌.. అక్క‌డి వారికే ప్రాధాన్యం ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ, ఎక్క‌డో అంబ‌టి పేరు కూడా జాబితాలో ఉంద‌ని మీడియాలో రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు కూల్‌గా ఉన్న ఆయ‌నలోనూ టెన్ష‌న్ ప్రారంభ‌మైంది. అడిగితే చెప్పేవారు.. లేరు. అలాగ‌ని.. సైలెంట్‌గా ఉండ‌లేరు. దీంతో తీవ్ర టెన్ష‌న్ ఎదుర్కొన్నారు.

ఎట్ట‌కేల‌కు ఆదివారం రాత్రికి ఖ‌రారైన జాబితాలో అంబ‌టి పేరు ఉండ‌డంతో ఆయ‌న టెన్ష‌న్ కొంత త‌గ్గింది. ఈ టెన్ష‌న్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆయ‌న ఏకంగా.. స్విమ్మింగ్ పూల్‌లో ఓ గంట‌న్న‌ర‌పాటు ఈత కొట్టారు. మ‌రికొంద‌రు.. ఇంట్లోనే ఫుల్ ఏసీలు పెట్టుకుని రిలాక్స్ అయ్యారు. ఇంకొంద‌రికి క‌న్నీరు ఆగ‌లేదు.

వీరిలో కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. మ‌రికొంద‌రు అయితే.. ఇంకా న‌మ్మ‌లేకున్నామ‌ని..చెప్పిన వారు ఉన్నారు. ఇక‌, మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌ని వారి టెన్ష‌న్ మ‌రో టెన్స‌న్‌లో ఉండిపోయారు. వీరు ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు రాలేదు. ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు మంత్రులుగా ఉండి.. ప‌ద‌వులు రాని వారు తీవ్ర ఆగ్ర‌వేశాల‌తో ఇంకా న‌రాలు తెగే టెన్ష‌న్‌ను అనుభ‌విస్తూనే ఉన్నారు. ఇదీ.. సంగ‌తి!!