Begin typing your search above and press return to search.

కరోనా విజేతలకు ఎంత మోతాదులో టీకా అవసరం?

By:  Tupaki Desk   |   3 May 2021 1:30 AM GMT
కరోనా విజేతలకు ఎంత మోతాదులో టీకా అవసరం?
X
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు అన్ని దేశాల్లో టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యాక్సినేషన్ తోనే వైరస్ ను కట్టడి చేయగలమని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే ఇప్పటికే లక్షల మంది మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. కరోనా విజేతలకు రెండో సారి వైరస్ సోకుతోంది. అందుకే అందరికీ టీకా ఇస్తున్నారు. కరోనాను జయించిన వారికి ఇచ్చే టీకా మోతాదుపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

వైరస్ ను జయించిన వారి శరీరంలో యాంటీ బాడీలు తయారవుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. వారి శరీరంలో బీ, టీ కణాలు ఉత్పత్రి అవుతాయి. వాటిలో టీ కణాలు వైరస్ ను కిల్లర్ కాగా, బీ కణాలు వాటి ఉనికిని గుర్తిస్తాయి. అంతేకాకుండా టీ కణాల ఉత్పత్తి చేయడానికి సాయపడుతుంది. ఇలా రెండోసారి మహమ్మారి సోకినప్పుడు పెద్దగా ముప్పు ఉండదని వైద్యులు వెల్లడించారు. అయినా కొందరు కరోనా విజేతలు రెండు డోసుల టీకా తీసుకుంటున్నారు.

కరోనాను జయించిన వారికి కేవలం ఒక్క డోసు వ్యాక్సిన్ సరిపోతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. రెండో డోసు వల్ల యాంటీ బాడీల ఉత్పత్పిలో ఎలాంటి ప్రతిస్పందని లేదని వెల్లడించారు. మొదటి డోసు అనంతరం ప్రతిరోధకాలు వేగంగా ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించారు. ఈ ప్రతిరోధకాలు కొందరిలో ఏడాది ఉండగా మరికొందరిలో నెలల పాటు నిర్వహించబడుతున్నాయని వివరించారు. విదేశాల్లో ఈ అధ్యయనం అనంతరం టీకా పంపిణీలో పలు మార్పులు జరిగాయి. కరోనా విజేతలకు కేవలం ఒక్క డోసు ఇవ్వాలని నిర్ణయించాయి. ఇజ్రాయెల్ లో ఫిబ్రవరి నుంచి ఇది అమలవుతోంది.

మనదేశంలో కరోనా జయించిన వారికి వ్యాక్సినేషన్ పై ఎలాంటి పరిశోధనలు జరగలేదు. కానీ ఇవి చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ఇప్పటికే లక్షల మంది వైరస్ నుంచి విముక్తి పొందారు. వారందరికీ ఒకే డోసు అవసరమైతే దేశంలో వ్యాక్సిన్ కొరత ఉండదని అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా ఈ పరిశోధనలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ టీకా పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. అయితే దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.