Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాటకు నాయిని ఎంత విలువ ఇస్తారంటే?
By: Tupaki Desk | 22 Oct 2020 4:45 AMఇప్పటి రాజకీయాలకు అప్పటి రాజకీయాలకు పోలికే ఉండదు. విలువల కోసం.. ఇచ్చిన మాట కోసం.. అధినేత నోటి నుంచి ఆదేశం వచ్చినంతనే.. వెనుకా ముందు చూసుకోకుండా నిర్ణయం తీసుకోవటం.. స్వార్థం అన్నది లేకుండా పార్టీ.. పార్టీ లైన్ మాత్రమే ముఖ్యమని భావించే పాతతరం నేతల్లో నాయిని నర్సింహారెడ్డి ఒకరు. ఆయన రాజకీయ జీవితాన్ని చూసినప్పుడు.. ఎన్నో వైరుధ్యాలుకనిపిస్తాయి. గెలుపు ఓటములతోకలిసి ప్రయాణించారు. అలుపెరగకుండా పోరాడుతూనే ఉండేవారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతకైనా సరే అన్నట్లుగా వ్యవహరించేవారు.
తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో ఆరాటపడే నాయిని.. అందుకోసం పలు ఉద్యమాల్లోపాల్గొన్నారు. ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఆర్ఎస్ 2004లో కలిసి పోటీ చేయటం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాము తెలంగాణను ఇస్తామని మాటకు భిన్నంగా కాంగ్రెస్ తీరు ఉండటంతో ఆగ్రహానికి గురైన కేసీఆర్.. పార్టీతో తెగ తెంపులు చేసుకోవటమే కాదు.. తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు.
కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నాటికి వైఎస్ మంత్రివర్గంలో విద్యాశాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న నాయిని అమెరికాలో ఉన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని కోరినంతనే.. వెనుకా ముందు చూసుకోకుండా అమెరికా నుంచే తన రాజీనామా లేఖను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నేరుగా పంపిన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇప్పటి నాయకుల మాదిరి.. మంత్రి పదవిని పోగొట్టుకునే కంటే.. పార్టీ నుంచి జంప్ కావటం.. అధినేతకు థోకా ఇవ్వటం లాంటివి నాయినిలో అస్సలు కనిపించవు. పార్టీకి విశ్వసనీయమైన వ్యక్తిగా.. పార్టీ లైన్ ను క్రాస్ చేయని కమిట్ మెంట్ నేతగానాయిని నిలిచిపోతారు.
అలాంటి నాయకుడ్ని ఇప్పట్లో ఆశించటం కష్టమేఅవుతుంది. కష్టంలోనూ.. సుఖంలోనూ.. గులాబీ అధినేత కేసీఆర్ వెంట నడిచిన ఆయన.. చివర్లో పదవులు లభించకపోవటంపై మాత్రంగుర్రుగా ఉండేవారు.అంతే తప్పించి.. పార్టీని వీడకుండా తన నిబ్దతను ప్రదర్శించారని చెప్పాలి.