Begin typing your search above and press return to search.
పవన్ కూడా నాలుక మడతెట్టేశాడు
By: Tupaki Desk | 28 Jan 2018 5:04 PM GMTఅనంతపురం పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు రాజకీయ నాయకుడిగా నిరూపించుకున్నారు. ముఖ్యంగా మూడున్నరేళ్ల కిందట ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన మాటలకు ఈరోజు కొత్త భాష్యాలు చెప్పి మాటలు మార్చడం తనకు కూడా వచ్చని, తానూ ఆ రాజకీయ తానులో ముక్కనేనని నిరూపించుకున్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ చెప్పిన మాటలను ఈ రోజు ఆయన అన్న మాటలను పరిశీలిస్తే పవన్ ఎంతలా నాలుక మడతెట్టేశాడో అర్థమైపోతుంది.
గత ఎన్నికల సమయంలో బీజేపీ - టీడీపీల తరఫున కాలికి బలపం కట్టుకుని తిరిగిన పవన్ అప్పట్లో చంద్రబాబు - మోదీల తరఫున అన్నీ తానై మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని చంద్రబాబు నెరవేరుస్తారన్న నమ్మకం తనకుందని.. చంద్రబాబు - నరేంద్ర మోదీ కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చేస్తారని అప్పట్లో పవన్ తాను అడుగుపెట్టిన ప్రతి ఊళ్లో చెప్పారు. ఆ తరువాత మేనిఫెస్టో మాట లేదు.. పవన్ గట్టిగా ప్రశ్నించిందీ లేదు. కానీ, ఇంతలోనే ఎన్నికలొచ్చేశాయి.. మళ్లీ చంద్రబాబు కోసం పవన్ ప్రచార గోదాలో దిగుతున్నారు. చంద్రబాబు కంటే ముందు ఆయనే ప్రచార యాత్రలు మొదలుపెడుతున్నారు. మరి.. జనంలో ఎవరైనా పవన్ పాత మాటలను పట్టుకుని అడిగితేనో... ఆనాటి మాటలేమయ్యాయి అని అడిగితేనో.. అందుకే, పవన్ ముందుగానే దానికి సమాధానం సిద్ధం చేసుకుని, అది జనంలోకి తీసుకెళ్లడం మొదలుపెడుతున్నారు. తననే కాదు, రేపు చంద్రబాబు ఓట్లు అడగడానికి వెళ్లినా ఆయన్నూ జనం అడక్కుండా ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాడు పవన్. అందులో భాగంగానే ఆయన తన నాలుకను అడ్డంగా మడతపెట్టి మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేయడం సాధ్యం కాదు కదా, చంద్రబాబును అందరం అర్థం చేసుకుందాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
అవును.. పవన్ ఈ రోజు తన ప్రసంగంలో "మేనిఫెస్టోలో ఇచ్చినవి కొన్ని సాధ్యపడతాయి. కొన్ని సాధ్యపడవు. కాకపోతే సాధ్యపడని పక్షంలో ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పగలగాలి. ప్రత్యేక హోదా కూడా ఇస్తామని చెప్పి, ఇవ్వలేకపోయారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేట్టు వివరించాలి. అలా చేయకపోతే ఓట్లు అడిగే హక్కు ఉండదు." ఇలా మేనిఫెస్టోపై మాటమార్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
దీంతో పవన్ ఈ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్నది పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు వైఫల్యాలన్నిటికీ పవన్ వివరణలు ఇచ్చుకుంటూ పోతారని.. చంద్రబాబు ప్రచార గోదాలోకి దిగేసరికి పరిస్థితి సానుకూలంగా మార్చి జనం ప్రశ్నించకుండా - తిరగబడకుండా చేసే పనిలో ప్రస్తుతం పవన్ ఉన్నారని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి పవన్ ముదిరిపోయాడన్నమాట. అందుకే పవనా.. ఆయనేం పొలిటీషియన్ అన్నవారు కూడా ఇప్పుడు పవన్ పొలిటీషియన్ అయ్యాడని నమ్ముతున్నారట.