Begin typing your search above and press return to search.
నెమళ్ల శృంగారమే..నిన్నటి గూగుల్ టాప్ సెర్చ్
By: Tupaki Desk | 2 Jun 2017 8:39 AM GMTప్రశ్న ఏదైనా.. వెతికేది మాత్రం గూగులమ్మనే. గతంలో ఏదైనా సందేహం వస్తే.. ఆయా రంగాలకు చెందిన నిపుణులనో.. పుస్తకాలనో వెతికే వారు. ఇప్పుడా కష్టాన్ని తీర్చేస్తూ.. ఎవరికి వారు సందేహం వచ్చినంతనే వేలి అంచులకు అందుబాటులో ఉండేలా గూగులమ్మ సిద్ధంగా ఉండటం తెలిసిందే.
గూగులమ్మ పుణ్యమా అని.. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇన్ స్టెంట్‌గా దొరికేస్తోంది. తాజాగా రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్రశర్మ వెలువరించిన తీర్పు.. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తన చివరి తీర్పు కింద ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చెబుతూ.. ఈ సందర్భంగా నెమళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. నెమళ్లు శృంగారం చేసుకోవని.. మగ నెమలి కన్నీళ్లు మాత్రమే తాగి ఆడ నెమళ్లు గర్భం దాలుస్తాయన్న ఆసక్తికర ముచ్చటను చెప్పారు.
మగ నెమళ్లు ఆజన్మాంతం బ్రహ్మచారులుగానే ఉండిపోతాయని ఆయన చెప్పిన మాట అందరిలోనూ అంతులేని కుతూహలాన్ని రేపింది. ఇంత కొత్త విషయం ఇప్పటివరకూ తెలియకపోవటం ఏమిటంటూ.. ఎవరికి వారు నెమళ్ల శృంగారం.. వాటి జీవన విధానం.. మగ నెమళ్లు ఎలా ఉంటాయి? ఆడ నెమళ్లు ఎలా గుడ్లు పెడతాయి? నెమలి సహచరుడు ఏం చేస్తాడు? ఆడ నెమలి ఎలా గర్భం దాలుస్తుంది? ఆడ నెమలికి.. మగ నెమలికి తేడా ఏమిటి? ఎన్ని గుడ్లను ఒక నెమలి పెడుతుంది? నెమలి పిల్లల్ని ఎలా కంటుంది? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలతో గూగులమ్మను మోత పుట్టించారట.
నిన్నటికి నిన్న గూగులమ్మను అత్యధికంగా సెర్చ్ చేసిన విషయాల్లో స్థానం దక్కించుకున్న అంశాల్లో.. నెమలి ముచ్చట అగ్రస్థానంలో ఉందట. మొత్తానికి జడ్జిగారి తీర్పు జనాల్లో నెమళ్ల మీద అవేర్ నెస్ పెరగటానికి కారణమైందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/