Begin typing your search above and press return to search.
జగన్ పార్టీలో ఆలీ ఎందుకు చేరారో చెప్పిన పవన్!
By: Tupaki Desk | 4 April 2019 7:18 AM GMTసినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు తమకు తాము పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ తరచూ చెప్పుకుంటూ ఉంటారు. మీడియాలోనూ.. పలు ఫంక్షన్లలోనూ. వివిధ కార్యక్రమాల్లో ఆయన మీద ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ జాబితాలో పలువురు అగ్ర నటులు మొదలు యువ నటుల వరకు మాత్రమే కాదు.. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆయన అభిమానిస్తూ.. ఆరాధిస్తామని చెబుతారు.
ఈ కోవలోకి ఆలీ.. కోన వెంకట్.. బిగ్ బాస్ కౌశల్.. శ్యామలతో పాటు.. నితిన్ తదితరులు పవన్ కు తాము ఎంత పెద్ద అభిమానులమో చెబుతూ ఉంటారు. మరి.. అలాంటి అభిమానగణం ఇప్పుడు సైలెంట్ గా ఉంటోంది. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి పవన్ అభిమానగణం చప్పుడు చేయకుండా ఉంటున్నారు.
వీరందరి విషయం ఎలా ఉన్నప్పటికీ.. హాస్యనటుడు ఆలీకి.. పవన్ కు మధ్యనున్న అనుబంధాన్ని.. స్నేహబంధాన్ని ప్రత్యేకంగా చెబుతుంటారు. పవన్ నటించిన అన్ని సినిమాల్లో నటించిన ఏకైన నటుడు ఆలీగా కొందరు చెబుతుంటారు. పవన్ తో ఆయనకున్న సానిహిత్యంతో ఆయన పాత్ర ప్రతి సినిమాలో ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.
అలాంటి ఆలీ.. ఈ మధ్యనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అందరిని విస్మయానికి గురి చేసింది. పవన్ కు అంత దగ్గరగా ఉండే ఆలీ.. చివరకు జగన్ పార్టీలో చేరటం ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. వాస్తవానికి ఆలీ జగన్ పార్టీలో చేరటానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన తొలుత పవన్ పార్టీలో అని.. తర్వాత టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరిగినట్లుగా చెబుతారు. దీనికి తగ్గట్లే ఆయన టీడీపీ అధినేతతో భేటీ అయ్యారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు.
గుంటూరు.. రాజమండ్రి సీట్లను ఆశించిన ఆలీకి నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే తాజాగా ఆలీ ఎపిసోడ్ కు సంబంధించి పవన్ రియాక్ట్ అయ్యారు. ఆయన చెప్పిన మాట ఆశ్చర్యానికి గురి చేసేలా మారింది. పవన్ కంటే కూడా జగన్ రాజకీయంగా బలమెక్కువని నమ్మి ఉండొచ్చన్నారు. అందుకే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండొచ్చాన్నారు. చూస్తుంటే.. పవన్ స్పందన తర్వాత ఆలీ ఈ అంశం మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదంటున్నారు. తనకు అత్యంత సన్నిహితుడు తన వైరివర్గంలోకి చేరిన వైనంపై పవన్ స్పందన ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. తనకు హ్యాండిచ్చిన మిత్రుడి మీద పవన్ స్పందించిన తీరుతో రానున్న రోజుల్లో ఆలీ నోట మాట రాని విధంగా పవన్ మాట ఉందని చెప్పక తప్పదు.