Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ ఎంత దరిద్రపుగొట్టుదంటే?

By:  Tupaki Desk   |   23 Dec 2022 6:30 AM GMT
ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ ఎంత దరిద్రపుగొట్టుదంటే?
X
కరోనాకు పుట్టినిల్లు చైనాకు చుక్కలు చూపిస్తోంది ఒమిక్రాన్ బీఎఫ్7 వేరియంట్. జీరో కొవిడ్ పాలసీ నుంచి తలుపులు బార్లా తీసేసిన వైనంతో మొదలైన రచ్చ.. ఇప్పుడా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాము చేసిన తప్పు ఎంతన్న విషయం ప్రతి ఒక్క చైనీయుడికి చుక్కలు కనిపించేలా చేస్తోంది. ఇప్పటివరకు కరోనా విలయతాండవం ఎలా ఉంటుందన్న విషయంపై వారికి పూర్తి అవగాహన కలిగేలా చేస్తోంది.

వార్తా సంస్థలన్ని చైనా మీద ఫోకస్ చేయటంతో .. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నా పెద్దగా రిపోర్టు కావటం లేదు. అయితే.. చైనాను సుడిగాలి మాదిరి చుట్టేసిన ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ విషయానికి వస్తే.. దరిద్రపుగొట్టుతనానికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతున్నారు. మనదేశంలోనూ ఇదే వేరియంట్ కు చెందిన కసులు బయటపడటం తెలిసిందే. ఇక.. దీని గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లోకి వెళితే..

- బీఎఫ్ 7 వేరియంట్ విషయానికి వస్తే.. ఇది ఒమిక్రాన్ బీఏ5కు చెందిన సబ్ వేరియంట్.

- దీనికి వేగంగా వ్యాపించే లక్షణంతో పాటు.. బలమైన ఇన్ ఫెక్షన్ ను కలిగించే సామర్థ్యం ఎక్కువ.

- దీని ఇంక్యుబేషన్ వ్యవధి చాలా తక్కువ.

- దీనికి ఉన్న మరో దరిద్రపుగొట్టు లక్షణం ఏమంటే.. ఇప్పటికే కొవిడ్ బారిన పడినోళ్లు.. కోలుకున్న వారు.. వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇలా అందరిని తన దరిద్రాన్ని అంటించే సామర్థ్యం ఎక్కువ.

- చైనాలోనే కాదు ఈ వేరియంట్ ఇప్పటికే అమెరికా.. బ్రిటన్.. బెల్జియం.. జర్మనీ.. ఫ్రాన్స్.. డెన్మార్క్ తదితర దేశాల్లోనే గుర్తించారు.

- ఈ వేరియంట్ ఆర్ నాట్ 10 నుంచి 18.6 గా లెక్క వేశారు. అంటే.. ఈ వేరియంట్ వైరస్ సోకిన వారు నుంచి కనిష్ఠంగా పది.. గరిష్ఠంగా 18.6 మంది వరకు వ్యాప్తి చెందే వీలుంది.

- ఈ వేరియంట్ బారిన పడినోళ్లకు జ్వరం.. దగ్గు.. గొంతు గరగర.. జలుబు.. నీరసం.. విపరీతంగా ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

- చాలా కొద్ది కేసుల్లో మాత్రం వాంతులు.. డయేరియా.. ఉదర సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది.

- అన్నింటికంటే అపాయకరమైన విషయం ఏమంటే.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పెద్దవయస్కులు.. పిల్లలు.. గర్భిణిలు.. మహిళలతో పాటు.. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారు ఈ వేరియంట్ బారిన పడే వీలుంది. కేన్సీర్.. షుగర్.. కిడ్నీ.. కార్డియాక్ సమస్యలు ఉన్న వారు దీని బారిన పడితే ప్రమాదం ఎక్కువని హెచ్చరిస్తున్నారు.

- ఈ వేరియంట్ కు ప్రాణం తీసేంత సీన్ లేకున్నా.. ప్రాణాలు తీసేంతలా చుక్కలు చూపించటం దీనికున్న మరో గుణం. అనారోగ్యంగా ఉండేవారు.. ఆరోగ్య సమస్యలు ఉన్న వారితో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఏమైనా.. ఈ వేరియంట్ మీద మరింత స్పష్టత వచ్చి.. మన దగ్గర ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందన్న దాన్ని గుర్తించే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.