Begin typing your search above and press return to search.
శ్రీ అత్మ సాక్ష్తి గ్రూపు సర్వే : ఉత్తరాంధ్రాలో ఏ పార్టీకి ఎంత జనాదరణ అంటే...?
By: Tupaki Desk | 9 March 2023 3:07 PM GMTశ్రీ అత్మ సాక్ష్తి గ్రూపు సర్వే ఓటర్స్ పల్స్ స్టడీ పేరిట చేసిన ఒక సర్వే ఇపుడు వైరల్ అవుతోంది. ఇది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 5 దాకా ఉత్తరాంధ్రాలోని ఆరు జిల్లాలలో ప్రజల రాజకీయ మనోగతాన్ని అంచనా వేసి వెలుగులోకి తెచ్చిన విషయాలను ముందుంచుతోంది. ఈ సర్వే ప్రకారం చూస్తే అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం సహా ఏ రాజకీయ పార్టీకి ఈ ప్రాంతం ప్రజలలో ఆదరణ ఉంది. ప్రజల అభిప్రాయాలు ఏంటి అన్నది జాగ్రత్తగా పల్స్ ని పట్టుకుని సర్వే చేసింది.
నిరుద్యోగులు, యువత, వ్యవసాయదారులు, స్థానిక ప్రజలకు, మహిళలు, వారి పధకాలు, సమస్యలు ప్రభుత్వ పధకాల మీద పాలసీల మీద జాబ్ కాలెండర్ మీద రైతాంగ అంశాల మీద వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ళుగా చేస్తున్న పాలన తీసుకుంటున్న నిర్ణయాల మీద అభిప్రాయాలను శ్రీ అత్మ సాక్ష్తి గ్రూపు సర్వే నిర్వహించారు.
దాని ప్రకారం చూస్తే ఓవరాల్ గా ఉత్తరాంధ్రాలో అధికార వైసీపీకి 44.50 శాతం మంది ప్రజానీకం మద్దతు దక్కుతోంది. వైసీపీ ప్రభుత్వ పాలన బాగుందని వారు చెబుతున్నారు. పధకాలు ఇతర కార్యక్రమాల పట్ల వీరంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో 53.50 శాతం ప్రజనీకం మాత్రం ప్రభుత్వ పని తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. వీరికి పాలన నచ్చలేదని అంటున్నారు. ఇక రెండు శాతం మంది మాత్రం తమకు ప్రభుత్వ పాలన మీద పెద్దగా ఏ అభిప్రాయం లేదని చెప్పేశారు.
జిల్లాల వారీగా చూసుకుంటే ముందుగా శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసీపీకి మద్దతుగా 44.12 శాతం మంది మాత్రమే నిలిచారు. ప్రభుత్వ పనితీరు పట్ల వారే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని భావించాలి. అదే టైం లో విపక్ష తెలుగుదేశం పట్ల ఆకర్షితులు అవుతున్న వారి సంగతి చూస్తే అది 47 శాతంగా ఉంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి ఆదరణ పెరుగుతోంది అన్న మాట.
ఇక ఇదే జిల్లాలో జనసేన బీజేపీ కూటమికి జనాదరణ చూసుకుంటే 5.12 శాతం మంది మద్దతుగా నిలిచారు. ఇతర రాజకీయ పార్టీలకు అనుకూలంగా 2.12 శాతం మంది మొగ్గు చూపిస్తే అసలు రాజకీయాల పట్ల ఏ మాత్రం ఐడియా లేదని 1.62 శాతం మంది చెప్పారు. ఇదీ శ్రీకాకుళం పరిస్థితి. అంటే అధికార పార్టీ అలెర్ట్ కావాల్సిందే అన్న మాట.
ఇక కొత్తగా ఏర్పడిన పార్వతీపురం జిల్లాలో రాజకీయ పరిస్థితులను శ్రీ అత్మ సాక్ష్తి గ్రూపు సర్వే అంచనా వేసినపుడు వైసీపీకి మద్దతుగా 46.25 శాతం మంది నిలిచారు. అదే టైంలో తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో 45 శాతం మద్దతు దక్కడం విశేషం. ఇక జనసేన బీజేపీ కూటమి పట్ల మోజు పెంచుకుంటున్న వారు అయిదు శాతం ఉన్నారు. ఇతర పార్టీలకు సపోర్ట్ గా ఉన్న వారు 2.25 శాతంగా ఉంటే, రాజకీయంగా ఏ అభిప్రాయం చెప్పని వారు 1.50 శాతంగా ఉన్నారు.
విజయనగరం జిల్లా విషయానికి వస్తే వైసీపీకి మద్దతుగా నిలిచిన వారు 44.57 శాతంగా ఉన్నారు.అదే టైం లో తెలుగుదేశానికి అనూహ్యంగా అదరణ పెరిగింది. ఆ పార్టీ పట్ల విశ్వాసం చూపిస్తున్న వారు 46.42 శాతంగా ఉన్నారు. జనసేన బీజేపీ కూటమికి ఈ జిల్లాలో 5.28 శాతం మద్దతు లభిస్తోంది. ఇక ఇతర పార్టీల వైపు ఆసక్తిగా ఉన్న వారు 2.14 శాతంగా ఉన్నారు. రాజకీయంగా ఏ అభిప్రాయం చెప్పలేని వారు 1.57 శాతంగా ఉన్నారు అని వెల్లడించింది శ్రీ అత్మ సాక్ష్తి గ్రూపు వోటర్స్ పల్స్ సర్వే.
విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే వైసీపీకి మద్దతుగా ఉన్న ఓటు షేర్ 43.14 శాతంగా ఉంది. అలాగే తెలుగుదేశానికి 44.28 శాతంగా ఉంటే బీజేపీ కూటమికి ఏకంగా ఎనిమిది శాతం మద్దతు లభిస్తోంది. ఇతర పార్టీలకు 2.71 శాతం ఓటు షేర్ ఉంటే రాజకీయంగా ఏ అభిప్రాయం చెప్పలేని వారు 1.85 శాతంగా ఉన్నారు.
అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే అధికార వైసీపీకి మద్దతుగా నిల్చిన వారిని చూస్తే 43.50 శాతంగా ఉంది. తెలుగుదేశానికి దాదాపుగా అంతే స్థాయిలో అంటే 43 శాతంగా ఉంది అని అంటున్నారు. బీజేపీ కూటమి బలం ఇక్కడ బాగా పెరిగింది. ఏకంగా తొమ్మిది శాతం ఓట్ల షేర్ ఆ పార్టీకి ఉందని ఓటర్స్ పల్స్ సర్వే వెల్లడిస్తోంది. ఇతర పార్టీలకు 2.66 శాతంగా ఉంటే ఏ అభిప్రాయం చెప్పని వారు 1.83 శాతం ఉందని శ్రీ అత్మ సాక్ష్తి గ్రూపు సర్వే పేర్కొంది.
చివరిగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చూస్తే వైసీపీకి 46.66 శాతం ఓట్ల షేర్ ఇక్కడ ఉందని తెలుస్తోంది. వారంతా వైసీపీకి జై కొట్టారన్న మాట. టీడీపీకి 42 శాతం మద్దతు మాత్రమే లభించగా, జనసేన బీజేపీ కూటమికి ఏడు శాతం మద్దతు దక్కుతోంది. ఇతరుల కేటగిరీలో 2.33 శాతం మంది మద్దతుగా ఉన్నారు. ఏ అభిప్రాయం చెప్పని వారు రెండు శాతంగా ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.