Begin typing your search above and press return to search.

మన డేటా ఎంత వరకు భద్రం?

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:23 AM GMT
మన డేటా ఎంత వరకు భద్రం?
X
95% పైగా భారతీయ యాప్స్, వెబ్‌సైట్లు వినియోగదారుల డేటాను థర్డ్ పార్టీలతో పంచుకుంటున్నాయని ఒక కొత్త అధ్యయనం బాంబు పేల్చింది. 96% డేటా భారతదేశం నుంచి ఇతరులకు పంపబడుతోందని తేల్చింది. ఇది ప్రధానంగా ఈ యాప్స్, వెబ్ సైట్లు తమ సర్వర్‌లను అమెరికాలో కలిగి ఉన్నాయి. కొన్ని సర్వర్లు యూరప్ లో ఉన్నాయి. వీటన్నింటి నుంచి థర్డ్ పార్టీలకు డేటా వెళుతోందని.. కొందరు అమ్ముకుంటున్నారు’అని కన్సల్టింగ్ సంస్థ అర్కా సీఈవో శివంగి నడ్కర్ణి తెలిపారు.

భారతదేశం నుంచి 100 సంస్థలు, మూడు డిజిటల్ ప్రాపర్టీ సంస్థ, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్, అనుబంధ వెబ్‌సైట్‌లను ఆర్కా సంస్థ అధ్యయనం చేసింది. గూగుల్ ఈ అన్నింటికి అతిపెద్ద థర్డ్ పార్టీ సంస్థ, తరువాత ఫేస్బుక్ , అమెజాన్ సంస్థలున్నాయి. అన్ని వెబ్‌సైట్లలో థర్డ్ పార్టీ ట్రాకర్లు పొందుపరచాయని నిగ్గుతేల్చింది.

ఏదేమైనా, 2018 సర్వేతో పోల్చితే, ఒక యాప్ లో పొందుపరిచిన డేటా 40% గల్లంతైంది. అన్ని యాప్ లలో థర్డ్ పార్టీలకు 65% డేటా బయటకు పోతోందని తేలింది. కొత్త యాప్స్ స్థాపించేటప్పుడు గోపత్య పక్కదారి పట్టనీయమని చెప్పి.. డేటా గోప్యతకు క్రమంగా మారడాన్ని ఆర్కా సంస్థ గుర్తించింది.

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు తీసుకొచ్చినా గూగుల్ మరియు ఆపిల్ స్టోర్లలో విధానాలలో మార్పు తెచ్చినా కొన్ని యాప్స్ , వెబ్ సైట్స్ మాత్రం డేటాను థర్డ్ పార్టీలకు డేటా ఇస్తున్నాయని గుర్తించారు.

29% పిల్లల యాప్స్ లకు అనుమతులు లేవని, కేవలం 38% మందికి తల్లిదండ్రుల నియంత్రణ ఉందని ఆర్కా సంస్థ తేల్చింది. 64% ఇతర యాప్స్ లతో థర్డ్ పార్టీలు అనుసంధానించబడ్డాయి. 93% యాప్స్ లో ప్రకటనలు ఉన్నాయి. ఇవన్నీ వినియోగదారుల డేటాను పక్కదారి పట్టిస్తున్నాయని తేలింది. ఇది లబ్ధిదారుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.