Begin typing your search above and press return to search.
టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే..
By: Tupaki Desk | 24 March 2016 1:43 PM GMTమొత్తానికి పోయిందనుకున్న మ్యాచ్ ను గెలిచేసి టీ20 ప్రపంచకప్ సెమీస్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది టీమ్ ఇండియా. బంగ్లాతో మ్యాచ్ ఓడితే భారత్ కథ ముగిసేది కాదు కానీ.. సెమీస్ అవకాశాలు మాత్రం బాగా సంక్లిష్టమయ్యేవి.ఐతే బంగ్లాపై అతి కష్టం మీద గెలిచిన భారత్ కు అసలు సవాల్ ఆదివారం ఉంది. ఆరోజు ఆస్ట్రేలియాను ఓడిస్తేనే భారత్ ముందంజ వేస్తుంది. ధోనీసేనకు మరో ఛాయిస్ ఏమీ లేదు. ఎందుకంటే రెండు మ్యాచ్ లు గెలిచినప్పటికీ భారత్ నెట్ రన్ రేట్ లో వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడటం వల్ల మన నెట్ రన్ రేట్ ఇంకా మైనస్ లోనే ఉంది.
భారత్ తో మ్యాచ్ కంటే ముందు ఆస్ట్రేలియా.. 3 మ్యాచ్ లో ఒకటే గెలిచిన పాకిస్థాన్ ను ఢీకొనబోతోంది. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే.. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. తర్వాత ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే సెమీస్ బెర్తు. ఆస్ట్రేలియాపై పాక్ గెలిచి.. చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటికే రన్ రేట్ లో వెనకబడి ఉన్నాం. ఆస్ట్రేలియా - పాకిస్థాన్ జట్లలో ఎవరికి మెరుగైన రన్ రేట్ ఉంటే వాళ్లే ముందంజ వేస్తారు. అంటే సెమీస్ చేరడానికి భారత్ కు ఉన్న ఏకైక మార్గం.. ఆస్ట్రేలియాను ఓడించడమే. ఐతే వర్షం కారణంగా ఈ రెండు మ్యాచుల్లో ఏదైనా రద్దయితే.. సమీకరణాలు మారిపోతాయి.