Begin typing your search above and press return to search.
యుద్ధం ఎంత భయానకం.. జట్టు కత్తిరించుకున్న ఉక్రెయిన్ అమ్మాయిలు
By: Tupaki Desk | 9 April 2022 5:06 AM GMTశత్రుదేశాల లెక్క తేల్చేందుకు యుద్దం చేయాలని కొందరు ఊగిపోతుంటారు. యుద్ధం అన్నది మొదలే కాకూడదు. కానీ.. అదోసారి మొదలైతే ఆరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ఎన్నో భయానక ఉదంతాలు చోటు చేసుకోవటమే కాదు.. ఆ గాయాలు దశాబ్దాల తరబడి ఆ జాతి మొత్తాన్ని వెంటాడుతూ ఉంటాయి. తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న యుద్ధం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
మనిషి ప్రాణానికి విలువ లేకపోవటం.. ఇష్టారాజ్యంగా బాంబుదాడులతో అమాయక ప్రజలు వందలాదిగా మరణించటం ఒక ఎత్తు అయితే.. దాడుల్లో పెద్ద ఎత్తున గాయాల బారిన పడినోళ్లు భారీగా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రష్యా సైనికుల ఆరాచకానికి అడ్డే లేకుండా పోతుందని వాపోతున్నారు.
ఆడపిల్ల కనిపిస్తే చాలు.. వయసుతో సంబంధం లేకుండా ఎత్తుకెళ్లి అత్యాచారాలు చేస్తున్న వైనంతో ఆడపిల్లలు బిక్కచచ్చిపోతున్నారు.
యుద్ధం వేళ ఉక్రెయిన్ ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ఒక వార్తా సంస్థ ప్రచురించిన ప్రత్యేక కథనం షాకింగ్ గా మారింది. యుద్ధం ఎంతటి ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందన్న విషయాన్ని సదరు కథనం స్పష్టం చేసింది. పుతిన్ సేనల అధీనంలోఉన్న ఒక ఊరికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు (వారి వయసు 15-16 ఏళ్ల మధ్యన ఉంటారు) తాముండే బేస్ మెంట్ కు వచ్చిన రష్యా సైనికులు ఆ ఇద్దరు ఆడపిల్లల్నిజుట్టు పట్టుకొని లాక్కెళ్లారని పేర్కొన్నారు.
అందుకు అమ్మాయిలు అందంగా కనిపించకుండా ఉండేందుకు జట్టు కత్తిరించుకోవటం ప్రారంభించినట్లుగా సదరు కథనం పేర్కొంది. ఇలాంటి ఉదంతాలెన్నో ఉక్రెయిన్ లో ఇప్పుడు కనిపిస్తాయని చెబుతున్నారు.
కీవ్ ప్రాంతాన్ని రష్యా బలగాలు ఆక్రమించుకునే సమయంలో ఇలాంటి ఉదంతాలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఆడపిల్లల పరిస్థితి ఇలా ఉంటే.. బాంబు దాడిలో గాయాల బారిన పడిన వారు జీవితాంతం ఆ గాయాలతోనే బతుకును లాగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మారణహోమాన్ని ఆపేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి తక్షణమే స్పందించాలని.. లేదంటే సమితిని రద్దు చేసుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పరుష వ్యాఖ్యలు చేశారు. మరి.. సమితి ఏ రీతిలో రియాక్టు అవుతుందో?