Begin typing your search above and press return to search.

వైరల్ వీడియోలో వ్యక్తి చెప్పినట్లు.. బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా?

By:  Tupaki Desk   |   23 April 2021 3:30 AM GMT
వైరల్ వీడియోలో వ్యక్తి చెప్పినట్లు.. బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా?
X
కరోనా మహ్మమ్మారి దెబ్బకు ఈ రోజున యావద్దేశం ఆగమాగమైపోతోంది. పిట్టల మాదిరి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రభుత్వాలు చేష్టలుడిగిపోయిన వేళ.. సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వీడియోలు.. మరికొన్ని పనికొచ్చే వీడియోలు అదే పనిగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఔత్సాహికులు ముందుకు వచ్చి.. ప్రత్యేకంగా వీడియోలు తీసి మరీ.. తమకు తెలిసిన విషయాన్ని సాదోహరణగా చేసి చూపిస్తున్నారు.

గడిచిన రెండురోజులుగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి చేతి వేలికి ఆక్సిమీటర్ పెట్టుకొని.. బొర్లా పడుకొని ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతున్న విషయాన్ని చూపిస్తూ.. అలా చేయాలని కోరుతున్నారు. అతడు చెప్పిన దాన్లో నిజం ఎంత ఉంది? సదరు వ్యక్తి చెప్పినట్లే చేస్తే.. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా? అన్నది ప్రశ్న. దీనికి సంబంధించి నిజం ఎంత? అన్న విషయాన్ని క్రాస్ చెక్ చేస్తే.. బయటకు వచ్చిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.

వీడియోలో ఏముంది?
ఓ వ్యక్తి రక్తంలో పడిపోయి ఆక్సిజన్ లెవల్స్ ను తేలిగ్గా ఎలా పెంచుకోవాలో చూపిస్తారు. బోర్లా పడుకొని ఛాతీపై బరువు వేసి.. బలంగా ఊపిరి పీల్చటంతో రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. తాను చెప్పింది నిజమన్న విషయాన్ని తన వేలుకు ఉన్న ఆక్సిమీటర్ తో రుజువుగా చూపించారు.

ఇదేం టెక్నిక్? నిజమెంత?
వీడియోలో చూపించిన టెక్నిక్ నిజమైనదే. ఛాతీ.. పొట్టపై బరువు వేసి లేదంటే.. పక్కకు పడుకొని ఊపిరి పీల్చటం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందుతుందని చెబుతున్నారు. తీవ్రమైన శ్వాస సంబంధమైన వ్యాధులతో బాద పడుతున్న ఈ టెక్నిక్ పాటించాలన్న సూచన వినిపిస్తోంది. దీన్ని శాస్త్రీయంగా ప్రోనింగ్ పొజిషన్ గా వ్యవహరిస్తారు. దీంతో సానుకూల ఫలితం ఉంటుందని 2002లో యూరోపియన్ రెస్సిరేటరీ జర్నల్ లో ప్రచురించారు.
ఈ విధానం ఇప్పుడెందుకు అవసరం?

ఇవాల్టి రోజున కరోనా కేసులు భారీగా పెరిగాపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు .. ఆక్సిజన్ బెడ్లు అసలు లేని పరిస్థితి. ఇలాంటి వేళ.. తేలికైన విధానంతో శ్వాస సంబంధిత సమస్యల్ని తీర్చుకునే మార్గాల్ని పలువురు అన్వేషిస్తున్నారు. ఈ వీడియో సైతం ఆ కోవలోకే వస్తుంది. ఇందులోని టెక్నిక్ ను అనుసరించటం వల్ల.. ఆక్సిజన్ కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన సమయాన్ని మరికాస్త పొడిగించే వీలుంది.

ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉంటే మంచిది?
కరోనా వేళ. శ్వాస సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్న వారు బోలెడంత మంది. ఇలాంటి వారిలో చాలామందికి వాస్తవంగానే సమస్య ఉండటం ఒక ఎత్తు అయితే.. కొందరు మాత్రం అనవసరమైన భయాందోళనలతో వణుకుతున్న పరిస్థితి. దీంతో.. ఆక్సిమీటర్ చేతికి రాగానే అదే పనిగాపెట్టటం.. టెన్షన్ తో ఒకట్రెండు పాయింట్లు తగ్గినా ఆందోళనకు గురి కావటం.. దీంతో.. మరిన్ని సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 92-94 వరకుఆక్సిజన్ లెవెల్స్ ఉన్నా.. అనవసరమైన టెన్షన్ కు గురి కావాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ వైరల్ వీడియోలో పేర్కొన్న అంశాల్ని ఫాలో కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.