Begin typing your search above and press return to search.
వ్యతిరేక ఓటు బ్యాంకును ఎలా దక్కించుకుందాం.. టీడీపీ వ్యూహం ఇదే!
By: Tupaki Desk | 13 Jun 2022 11:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో ఆయన ఫోకస్ అంతా కూడా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకోవడం.. పార్టీకి అనుకూలం గా మార్చి.. వచ్చే ఎన్నికల్లో వారిని టీడీపీ మద్దతు దారులుగా తీర్చిదిద్దాలని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలు.. ప్రజలు.. సామాజిక వర్గాల వారీగా `ఐటీడీపీ` సమాచారం సేకరిస్తోంది. దీనికి సంబందించి సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా.. ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా.. ఎవరు గళం విని పించినా.. వారిని ఐటీడీపీ గుర్తిస్తోంది. వారిని పార్టీకి చేరువ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోం ది. అదేసమయంలో బహిరంగ వేదికలపై కూడా.. వైసీపీని వ్యతిరేకించే గళాలను గుర్తిస్తున్నారు. వారిని కూడా పార్టీకి చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వారిని తనవైపు తిప్పుకొనేందుకు చంద్రబాబు.. నేరుగా రంగంలోకి దిగుతుండడమే పెద్ద వ్యూహంగా కనిపిస్తోంది.
తాజాగా గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన ఎస్సీ మహిళ వెంకాయమ్మ విషయంలో ఇదే జరిగిందని టీడీ పీ నేతలే చెబుతున్నారు. ఆమె కొన్నాళ్ల కిందట.. వైసీపీకి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా గళం వినిపించారు.
ఈ క్రమంలో వైసీపీ నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆమెకు అండగా నిలిచేందుకు టీడీపీ ముందుకు వచ్చింది. ఇది.. పార్టీకి ఒకరకంగా మేలు చేసిందని.. సీనియర్ నాయకు లు చెబుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు వ్యూహం ఫలిస్తోందని అంటున్నారు.
తాము అండగా నిలుస్తుండడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్టాడేవారు.. తమవైపు చూస్తున్నారని.. వారు చెబుతున్నారు. ఇక, పదోతరగతి తప్పిన విద్యార్థులతోనూ.. టీడీపీ మమేకం అయింది. ఇలా.. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా.. టీడీపీ దూకుడగా ముందుకు సాగుతుండడంతో ఆయా వర్గాలకు పార్టీకి చేరువ అవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు చేయనున్న జిల్లాల పర్యటనలోనూ ఇదే మంత్రంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
``ప్రభుత్వ వ్యతిరేక ఓటును సాధ్యమైనంత వరకు మావైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు కలిసి వస్తున్నాయి`` అని ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మొత్తానికి సర్కారు వ్యతిరేక ఓటు కనుక సంఘటితం చేయడంలో టీడీపీ సక్సెస్ అయితే.. సునాయాసంగా అదికార పగ్గాలు చేపట్టడం ఖాయమేనని అంటున్నారు.