Begin typing your search above and press return to search.
ఒమిక్రాన్ను ఎలా కంట్రోల్ చేయాలి ?
By: Tupaki Desk | 24 Dec 2021 9:33 AM GMTఇపుడిదే అంశం కేంద్ర ప్రభుత్వంతో పాట రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెట్టేస్తోంది. కొద్ది రోజులుగా దేశంలో ఒమిక్రాన్ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 350 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇంకా పరీక్షల రిజల్ట్ రావాల్సినవి, పరీక్షలకు పంపిన బ్లడ్ శాంపుల్స్ వేరే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ నియంత్రణపై మార్గదర్శకాలను జారీ చేసింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం కరోనా ఆంక్షలు కనీసం 14 రోజులు కఠినంగా అమల్లో ఉండేట్లు చూడాలని ఆదేశించింది. రాత్రుళ్ళు కర్ఫ్యూ విధించాలని, జనాలను ఒకచోట గుమిగూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని స్పష్టం చేసింది. జిల్లాల్లో నమోదవుతున్న డెల్టా, ఒమిక్రాన్ కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా చెప్పింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు కొనుక్కోవాలని, అనుమానితులకు కరోనా టెస్టులు చేయించాలని చెప్పింది.
ఇక ఆసుపత్రుల విషయంపై ముందుజాగ్రత్తలు చెప్పింది. ప్రతి ఆసుపత్రిలోను అదనపు బెడ్లను సిద్ధంగా ఉంచుకోవాలని, మందులను రెడీ చేసుకోవటంతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లు, సిలిండర్లను సిద్ధంగా ఉంచుకోమని చెప్పింది. జనాలంతా కచ్చితంగా కరోనా వైరస్ జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నది. కరోనా వైరస్, ఒమిక్రాన్ కేసుల వివరాలను జనాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పింది. దీనివల్ల జనాలు అప్రమత్తంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కేంద్రం చెప్పింది.
నూరుశాతం వ్యాక్సినేషన్ పై అన్నీ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని గట్టిగా చెప్పింది. వ్యాక్సినేషన్ సరిగా జరగని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ చేయాలని సూచించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించాలని స్పష్టంగా చెప్పింది. మొత్తం మీద తాజా మార్గదర్శకాలను చూస్తే ఒమిక్రాన్ కేసుల విషయంలో కేంద్రం ఎంతలా టెన్షన్ పడుతోందో అర్ధమైపోతోంది.