Begin typing your search above and press return to search.
బ్లాక్ మనీ మార్పుకోసం గూగుల్ పై పడ్డారు!
By: Tupaki Desk | 11 Nov 2016 3:42 AM GMTఎవరికి ఏ విషయం గురించి తెలియకపోయినా, తెలిసిన విషయంపై క్లారిటీ మిస్ అయినా వెంటనే చేసే పని గూగుల్ లో సెర్చ్ చేయడం. అక్కడున్న ఇన్ ఫర్మేషన్ అన్ని సందర్భాల్లోనూ కరెక్టా, తప్పా అనే సంగతులు కాసేపు పన్నపెడితే... తక్షణ ఆప్షన్ మాత్రం గూగుల్ తల్లే! ఈ క్రమంలో కాదేదీ అవినీతికి అనర్హం అని దోచేసిన బాబులంతా... కాదేదీ గూగుల్ సెర్చ్ కి అనర్హం అని భావించారో ఏమో కానీ... "నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం ఎలా" అని గూగుల్ లో తెగ సెర్చ్ చేసేశారు.
మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అప్పటి వరకూ మనుగడలో ఉన్న రూ.1000 - రూ.500 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ క్షణం నుంచి ఉలిక్కిపడిన నల్లబాబులంతా... గూగుల్ పై పడ్డారు. ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తే దొరికిపోతుందిరా అనుకుంటూ తెగ సెర్చ్ చేశారంట. మింట్ కథనం ప్రకారం గూగుల్ లో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం ఏలా అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లోనూ ఎక్కువగానే సెర్చ్ చేశారంట. ఈ విషయంలో హర్యానా - మహారాష్ట్ర, పంజాబ్ - దేశరాజధాని ఢిల్లీలు ముందువరుసలో ఉన్నాయట!
కాగా... 2016 ఇంటర్నెట్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం నాడు భారతదేశంలోని సుమారు 277 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు బ్లాక్ మనీ పైనా, తమవద్ద ఉన్న వైట్ నోట్లను సైతం ఎలా మార్చుకోవాలని, ఎక్కడెక్కడ మార్చుకోవచ్చని.. ఇలా ఐదారు టాపిక్స్ పై సెర్చ్ చేశారని... మోడీ ప్రకటన అనంతరం సందేహాల నివృత్తికోసం ఆన్ లైన్ నే ఆశ్రయించారని తెలుస్తోంది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/