Begin typing your search above and press return to search.

శృంగారంలో స్త్రీని జయించాలంటే ఇలా చేయండి

By:  Tupaki Desk   |   26 March 2020 1:30 AM GMT
శృంగారంలో స్త్రీని జయించాలంటే ఇలా చేయండి
X
శృంగారంలో స్త్రీ శరీరాన్ని గెలవాలంటే.. ముందు ఆమె మనస్సును గెలవాలని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. శృంగారంలో దంపతులిద్దరు పాల్గొన్నప్పుడు ఇరువురికి కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు ఆ సమయంలో నొప్పి కలుగుతుంది. అయితే వారు ఆ నొప్పి పంటిబిగువన భరిస్తారే తప్ప బయటికి చెప్పుకోలేక పోతుంటారు. కొందరు పెట్రోలియం జెల్లీ, అసహజమైన పద్ధతులను ఎంచుకుంటారు. అయితే ఇంతమాత్రం శ్రేయస్కారం కాదని నిపుణులు అంటున్నారు.

శృంగారంలో శరీరం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటుంది. అయితే మనసు మాత్రం మరో లోకంలో విహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఇది ఎక్కువగా ఉంటుంది. పార్టనర్స్ ఇద్దరు శృంగారంలో నొప్పి కలుగకుండా ఆనందంగా గడపడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

*అందరికీ ఒకేలా ఉండదు..

శృంగారంలో మహిళలు ఒక్కోరు ఒక్కొలా రియక్ట్ అవుతుంటారు. వారు ఎలా స్పందిస్తారో భాగస్వామి తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొందరు మహిళలకు ఇంద్రియ స్పర్శ సుఖాన్నిస్తుంది. మరికొందరికి ఇది అసౌకర్యంగా ఉండొచ్చు. కొందరికీ శృంగారంలో గిలిగింతలు పెడుతుంటాయి. వీటిని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే శృంగారం రసవత్తరంగా జరుగుతుంది.

* స్రవాలు ఊరేదాకా ఆగాల్సిందే..

శృంగారంలో మహిళల జననేంద్రియాల్లో స్రవాలు ఊరుతుంటాయి. ఇవి ఊరేలా భాగస్వామి మహిళలను ప్రేరేపించాలి. వారిని బలవంతం చేయకూడదు. భాగస్వామి చెవులు, మెడ, చేతులు, కాళ్లు, వెనుక, ఛాతీ, పాదాలు, ప్రతి అంగుళాన్ని తాకి ఆమెలో కోరికలను ప్రేరేపించాలి. వారు మానసికంగా సిద్ధమైతేనే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.

*ముద్దులకు ప్రత్యేక స్థానం

శృంగారంలో ముద్దులకు ప్రత్యేక స్థానం ఉంది. కొందరు మహిళలు ఫ్రెంచ్ కిస్ అంటే ఇష్టపడతారు. మరికొందరికీ అలాంటివి నచ్చవు. అయితే మీ పెదవులతో వెచ్చని స్పర్శ, వెచ్చని శ్వాసను ఇష్టపడుతుంటారు. ఫ్రెంచ్ కిస్ లతో దూకుడుగా వెళ్లకుండా సున్నితంగా వ్యవహరించాలి. అదేవిధంగా సున్నితమైన భాగాల్లో ముద్దులతో ప్రేరేపించాల్సి ఉంటుంది. ఆమె శరీరం మొత్తం వేడెక్కడానికి, శృంగార పరంగా మానసిక స్థితిలోకి తీసుకొచ్చేందుకు ముద్దులను ప్రేరేపకంగా వాడుకోవాలి.

*బలవంతం చేస్తే అసలుకే ఏసరు..

శృంగార విషయంలో బలవంతం చేయద్దు.. ఇలాంటివి చేస్తే అసలుకే మోసం వస్తుంది. శృంగారంలో పాల్గొనడానికి ఆమెకు ఇష్టం లేదో తెలుసుకోవాలి. ముందుగా ఆమె ఏమి కోరుకుంటుందో తెలుసుకోవాలి. ఓరల్ సెక్స్ కోసం బలవంతం చేయద్దు. భాగస్వామి యొక్క సున్నితమైన ప్రదేశాలను మెత్తగా తాకాలి. ఎందుకంటే స్త్రీ గుహ్యాంకురము చాలా సున్నితమైనది అందుకోసం వారిని ఉత్తేజపరచాల్సి ఉంటుంది. ఇలాంటి చిట్కాలను పాటించి మీ శృంగార జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ హ్యాపీ స్వీట్ డ్రీమ్స్..